Monday, December 23, 2024

ప్రజలకు మరింత సేవ చేయాలి: రాచకొండ సిపి

- Advertisement -
- Advertisement -

146 పోలీసులకు రివార్డులు
అందజేసిన రాచకొండ సిపి డిఎస్ చౌహాన్

హైదరాబాద్: పోలీసులు ప్రజలకు మరింత సేవ చేయాలని రాచకొండ పోలీస్ కమిషనర్ డిఎస్ చౌహాన్ అన్నారు. ఉత్తమ పనితీరు కనబర్చిన 146మంది పోలీసులకు రివార్డులు అందజేశారు. నేరెడ్‌మెట్‌లోని రాచకొండ పోలీస్ కమిషనరేట్‌లో మంగళవారం నిర్వహించిన సమావేశంలో అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టెక్నాలజీని ఉపయోగించుకుని మరిన్ని సేవలు అందించాలని కోరారు.

నేరాల నియంత్రణ, నేరస్థుల గుర్తింపు, త్వరగా స్పందించడం, గ్రీవన్స్, ఉమెన్ సేఫ్టీ, ట్రాఫిక్ మేనేజ్‌మెంట్‌ను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని కోరారు. ఉత్తమ పనితీరు కనబర్చుతున్న పోలీసులు మరింత ప్రోత్సహించాలని అన్నారు. కార్యక్రమంలో జాయింట్ సిపి సత్యనారాయణ, డిసిపిలు సాయిశ్రీ, జానకి, రాజేష్‌చంద్ర, శ్రీనివాస్, అనురాధ, ఎసిపిలు, ఇన్స్‌స్పెక్టర్లు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News