Thursday, November 14, 2024

మహంకాళి ఆలయాన్ని సందర్శించిన రాచకొండ సిపి

- Advertisement -
- Advertisement -

మల్కాజిగిరి : బోనాల పండుగ సమయంలో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉండడం వల్ల కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని రాచకొండ సిపి డిఎస్ చౌహాన్ ఐపిఎస్ అధికారులను ఆదేశించారు. మల్కాజిగిరిలో ఆదివారం సోమవారం జరగబోయే బోనాల ఉత్సవాల సందర్భంగా ఓల్డ్ మల్కాజిగిరి మహంకాళి అమ్మవారి గుడి, సఫీల్ గూడ కట్టమైసమ్మ గుడిని సిపి చౌహన్ సందర్శించి బందోబస్తు ఏర్పాట్లను సమీక్షించారు.

బోనాల పండుగ సమయంలో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉండడం వల్ల సాధారణ భక్తులకు ఈసారి ఎటువంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఆయన తెలియజేశారు. మహిళా భక్తులు, పిల్లలు, వృద్ధుల కోసం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఆలయ ఆవరణలో వాహనాలను క్రమ పద్ధతిలో పార్కింగ్ చేయడానికి తగు ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.

షీటీం బృందాలు కూడా మహిళా భక్తుల రక్షణ కోసం విధుల్లో ఉంటారని పేర్కొన్నారు. భక్తులు పోలీసు వారికి సహకరించాలని, సంతోషంగా బోనాల పండుగ జరుపుకోవాలని ఆకాక్షించారు. ఈ సమీక్షలో మల్కాజ్ గిరి డీసిపి డి.జానకి ఐ.పి.ఎస్, మల్కాజిగిరి ఏసిపి నరేష్ రెడ్డి, కుషాయిగూడ ఏసిపి వెంకట్ రెడ్డి, నేరెడ్మెట్, మల్కాజిగిరి సిఐలు ఇతర అధికారులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News