Wednesday, January 22, 2025

పోలీస్ క్రీడాకారులను అభినందించిన రాచకొండ సిపి

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః భవిష్యత్తులో క్రీడల్లో విజయాలు సాధించి పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకుని రావాలని రాచకొండ పోలీస్ కమిషనర్ డిఎస్ చౌహాన్ అన్నారు. రాచకొండ పోలీసుల తరఫున జాతీయ స్థాయిలో జరిగిన క్రీడల్లో పాల్గొని విజయాలు సాధించిన పోలీసులను సిపి డిఎస్ చౌహాన్ అభినందించారు. నేరెడ్‌మెట్‌లోని రాచకొండ పోలీస్ కమిషనరేట్‌లో సోమవారం వారు సిపిని కలిశారు. ఈ నెల 27,28వ తేదీల్లో హైదరాబాద్‌లోని పోస్టల్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన రెండో నేషనల్ మాస్టర్స్ వెయిట్‌లిఫ్టింగ్ మెన్, ఉమెన్ ఛాంపియన్‌షిప్ 2023 పోటీల్లో రాచకొండ పోలీసులు పాల్గొన్నారు.ఎం 60 ఏజ్ గ్రూపులో పురుషులు 109 కేజీల కేటగిరిలో ఎడిసిపి లక్ష్మినారాయణ మొదటి స్థానంలో నిలిచి బంగారు పథకం సాధించారు.

ఎం 55 విభాగంలో పురుషుల 81కిలోల కేటగిరిలో ఎఎఓ ప్రదీప్‌కుమార్ రెండో స్థానంలో నిలిచి వెండి పతకం గెలుచుకున్నారు. ఎం 34 విభాగంలో పురుషుల 109 కేజీల కేటగిరిలో ఇన్స్‌స్పెక్టర్ పవన్‌రామ్ మొదటి స్థానంలో నిలిచి బంగారు పతకం గెలుచుకున్నారు. పవన్ రామ్ ఆగస్టులో పోలాండ్ దేశంలో జరిగే ప్రపంచ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్ పోటీలకు అర్హత సాధించడంతో సిపి డిఎస్ చౌహాన్ అభినందించారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ తరఫు నుంచి క్రీడల్లో పాల్గొనే పోలీసులను అభినందిస్తామని సిపి డిఎస్ చౌహాన్ తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News