Sunday, February 23, 2025

ఉమెన్ పిసిని అభినందించిన రాచకొండ సిపి

- Advertisement -
- Advertisement -

Rachakonda CP congratulated the woman PC

హైదరాబాద్ : ఫెన్సింగ్ స్పోర్ట్స్ లో బ్రోంజ్ మెడల్ గెల్చుకున్న ఉమెన్ కానిస్టేబుల్‌ను రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ అభినందించారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఎఆర్ విభాగంలో మౌనికా రెడ్డి కానిస్టేబుల్‌గా పనిచేస్తోంది. న్యూఢిల్లీలో గత నెల 19వ తేదీ నుంచి 24వ తేదీ వరకు జరిగిన 7వ ఆల్ ఇండియా పోలీస్ జూడో క్లస్టర్ ఛాంపియన్ షిప్ 2022లో పాల్గొంది. ఇందులో బ్రోంజ్ మెడల్ గెల్చుకుంది. రాచకొండ పోలీస్ కమిషనర్‌ను సోమవారం మౌనికా రెడ్డి కలిశారు. ముందు ముందు మరిన్న విజయాలు సాధించాలని సిపి మహేష్ భగవత్ అభినందించారు. కార్యక్రమంలో ఎడిసిపి అడ్మిన్ నర్మద, ఎడిసిపి శమీర్ తదితరులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News