Monday, January 20, 2025

పోలీసులను అభినందించిన రాచకొండ సిపి

- Advertisement -
- Advertisement -

Rachakonda CP congratulating the police

 

మనతెలంగాణ, హైదరాబాద్ : జాతీయ స్థాయిలో జరిగిన పోలీస్ స్పోర్ట్‌లో మెడల్స్ గెల్చుకున్న పోలీసులను రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ అభినందించారు. నేరెడ్‌మెట్‌లోని రాచకొండ పోలీస్ కమిషనరేట్‌లో శుక్రవారం సిపి మహేష్ భగవత్‌ను అవార్డులు గెల్చుకున్న పోలీసులు కలిశారు. కేరళ రాష్ట్రం, తిరువనంతపురంలో ఈ నెల 18వ తేదీ నుంచి 22వ తేదీ వరకు జరిగిన పోలీస్ నేషనల్ లెవల్ స్పోర్ట్ ఈవెంట్స్‌లో డిసిపి శ్రీబాల, ఇన్స్‌స్పెక్టర్ పావన రమాకుమార్ పాల్గొన్నారు. ఇందులో డిసిపి శ్రీబాల రెండు గోల్డ్ మెడల్స్, మూడు సిల్వర్, బ్రాంజ్ మెడల్స్ గెల్చుకున్నారు. టేబుల్ టెన్నిస్, బ్యాడ్మింటన్‌లో అవార్డులు గెల్చుకున్నారు. జి.పావనరామ కుమార్ వేయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్‌లో 109కిలోల కంటే ఎక్కువగా ఎత్తి అవార్డు గెలుచుకున్నాడు. బెంగళూరులో జరిగిన పోటీలో విజేతగా నిలిచి ఇంటర్నేషనల్ మాస్టర్ వేయిట్ లిఫ్టింగ్ పోటీలకు అర్హత సాధించాడు. తెలంగాణకు చెందిన కృష్ణబాబు, నాగరాజు, శివరామకృష్ణ సిల్వర్ మెడల్స్ గెల్చుకున్నారు. మెడల్స్ గెల్చుకున్న వారిని పోలీస్ ఉన్నతాధికారులు అభినందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News