Thursday, January 23, 2025

పలు ఆలయాలను సందర్శించిన రాచకొండ సిపి డిఎస్ చౌహాన్

- Advertisement -
- Advertisement -

సిటీబ్యూరో: బోనాల పండుగ సమయంలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేస్తామని రాచకొండ పోలీస్ కమిషనర్ డిఎస్ చౌహాన్ అన్నారు. బోనాల సందర్భంగా రాచకొండ పోలీస్ కమిషనర్ డిఎస్ చౌహాన్ ఆదివారం బో నా లు జరగబోయే ఓల్డ్ మల్కాజ్‌గి రి మహంకాళి అమ్మవారి గుడి, సఫీల్‌గూడ కట్టమైసమ్మ గుడిని గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా భద్రతా ఏర్పాట్లపై పోలీసులకు పలు సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా రాచకొండ పోలీస్ కమిషనర్ డిఎస్ చౌహాన్ మాట్లాడుతూ బోనాల సమయంలో భక్తుల భారీ ఎత్తున తరలివచ్చే అవకాశం ఉందని, కట్టుదిట్టమై న భద్రతను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

సాధారణ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపా రు. మహిళలు, పిల్లలు, వృద్ధుల కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఆలయ ఆవరణలో వాహనాలను క్రమ పద్ధతిలో పార్కింగ్ చేసేందుకు ఏర్పాట్లు చేయాలని ఆధికారులను ఆదేశించారు. భక్తుల రక్షణ కోసం షీటీమ్స్‌ను బోనాల సందర్భంగా విధుల్లో ఉంచాలని అన్నారు. బోనాలు ప్రశాంతంగా ముగిసేందుకు భక్తులు పోలీసులకు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో మల్కాజ్‌గిరి డిసిపి జానకి, ఎసిపి నరేష్‌రెడ్డి, కుషాయిగూడ ఎసిపి వెంకట్‌రెడ్డి, నేరెడ్‌మెట్ మెట్, మల్కాజ్‌గిరి ఇన్‌స్పెక్టర్లు, ఆలయ అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News