Sunday, January 19, 2025

అగ్నిప్రమాద స్థలాన్ని పరిశీలించిన రాచకొండ సిపి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మల్లాపూర్‌లో జరిగిన అగ్నిప్రమాద ప్రాంతాన్ని రాచకొండ పోలీస్ కమిషనర్ డిఎస్ చౌహాన్ బుధవారం పరిశీలించారు. మల్లాపూర్ పారిశ్రామిక వాడలోని రసాయన పరిశ్రమలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న సిపి డిఎస్ చౌహాన్ వెంటనే స్పందించి అగ్నిప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో సిబ్బందికి సూచనలు ఇస్తూ ప్రమాద తీవ్రతను తగ్గించేందుకు చర్యలు తీసుకున్నారు.

Also read: కాళేశ్వరం నీటితో చెరువులు,కుంటలు సస్యశ్యామలం: కెటిఆర్

ఫైర్ అధికారులతో కలిసి మంటలు వ్యాపించకుండా, మరణాలు సంభవించకుండా చర్యలు తీసుకున్నారు. పరిశ్రమలలో అగ్నిప్రమాదాలు జరగకుండా ఆయా కంపెనీల యజమానులు చర్యలు తీసుకోవాలని రాచాకొండ పోలీస్ కమిషనర్ డిఎస్ చౌహాన్ అన్నారు. సాంకేతిక కారణాల వల్ల ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. అధికారులు, స్థానికులకు పలు సూచనలు, జాగ్రత్తలు చెప్పారు. సిపి వెంట డిసిపిలు జానకి, గిరిధర్, ఎసిపి నరేష్‌రెడ్డి ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News