- Advertisement -
హైదరాబాద్: వివిధ నేరాలు చేయడంతో రాచకొండ పోలీస్ కమిషనరేట్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్‌ను సర్వీస్ నుంచి తొలగిస్తూ సిపి మహేష్ భగవత్ ఆదేశాలు జారీ చేశారు. కానిస్టేబుల్ వి.ప్రభాకర్ రాచకొండ పోలీస్ కమిషనరేట్‌లో పనిచేస్తున్నాడు. తన లీవును సిక్‌గా మార్చుకునేందుకు మెడికల్ ఆఫీసర్ సంతకాన్ని ఫోర్జరీ చేశాడు. అంతేకాకుండా పలువురికి ప్రభుత్వ ఉద్యోగాలు పెట్టిస్తానని చెప్పి డబ్బులు వసూలు చేసి మోసం చేశాడు. అలాగే ఇంటిని నిర్మించుకునేందుకు మున్సిపాలిటీ నుంచి ఎన్‌ఓసి ఇప్పిస్తామని చెప్పి డబ్బులు వసూలు చేశాడు. ఆరోపణలపై సిపి విచారణ చేయడంతో అన్ని విషయాలు బయటపడ్డాయి. వెంటనే సర్వీస్ నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు.
- Advertisement -