సిటిబ్యూరో: వివాహం చేసుకుంటానని చెప్పి డబ్బులు తీసుకుని మోసం చేసిన కేసులో ఇద్దరు నిందితులను రాచకొండ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం…ఎపిలోని కృష్ణాజిల్లా, మచిలీపట్నం కు చెందిన ప్రసన్న తనుశ్రీ ప్రైవేట్ ఉద్యోగం చేస్తోంది. ప్రస న్న రవితేజ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. ఇద్దరు కలిసి సహజీవనం చేస్తున్నారు. లగ్జరీ లైఫ్‌కు అలవాటుపడిన ఇద్దరు ఇన్‌స్టాగ్రాంలో ఖాతాను ఓపెన్ చేశారు. తనుశ్రీ పేరుతో ఇన్‌స్టాగ్రాంలో ఫొటో పెట్టి నాలుగు ఖాతాలు ఓపెన్ చేయడంతో చాలామంది ఫాలోవర్స్ వచ్చారు. ఆమె పెట్టే పోస్టింగ్‌లకు లై క్‌లు వందలాది రావడంతో ఛీటింగ్ చేయాలని ప్లాన్ వేశారు.
దీంతో పలువురు యువకులతో నిందితురాలు ఛాటింగ్ చేసేది. కొద్ది రోజుల తర్వాత వివాహం చేసుకుంటానని చెప్పి వారిని నమ్మించేది. నిందితురాలి మాటలు నమ్మిన వారి ను ంచి తల్లి ఆరోగ్యం బాగాలేదని, కోవిడ్ వచ్చిందని చెప్పి పలుమార్లు బాధితుడి నుంచి రూ.31,66,000 వసూలు చేసింది. ఎనిమిది నెలలు బాధితుడిని పలు మార్లు అబద్దాలు చెప్పి డ బ్బులు వసూలు చేసింది. మళ్లీ డబ్బులు అడుగుతుండడంతో తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేసి ఇద్దరు నిందితులను అ రెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇన్స్‌స్పెక్టర్ రాజు కేసు దర్యాప్తు చేశారు.