Sunday, December 22, 2024

ఇన్‌స్టాతో మోసాలు

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః ఇన్‌స్టాగ్రాంలో వివిధ వస్తువులు విక్రయిస్తామని చెప్పి డబ్బులు తీసుకుని మోసం చేస్తున్న యువతిని రాచకొండ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం…ఎపిలోని విశాఖపట్టణానికి చెందిన సరకం గౌరీ సరికా వెంకట నూకాంబికా ఇన్‌స్టాల్ saisurekha49 పేరుతో ఓ ఐడిని నిర్వహిస్తోంది. ఇందులో వివిధ రకాల వస్తువులను పోస్ట్ చేస్తు పలువురిని ఆకర్శిస్తోంది. స్వల్పకాలంలోనే చాలామంది ఆమె ఇన్‌స్టాగ్రాం ఖాతాను ఫాలో అవుతున్నారు. దీనిని అవకాశంగా మల్చుకున్న నిందితురాలు వస్తువులకు సంబంధించిన ఆర్డర్లు తీసుకునేది, ముందుగాను కస్టమర్ల నుంచి డబ్బులు వసూలు చేసేది.

కాని ఎవరికీ ఇంత వరకు వస్తువులు పంపించలేదు. రాచకొండ పోలీస్ కమిషనరేట్‌కు చెందిన బాధితురాలు ఇన్‌స్టాల్ నిందితురాలి వస్తువులు చూసి ఆర్డర్ ఇచ్చింది. డబ్బులు ముందుగానే పంపించింది. డబ్బులు తీసుకుని చాలా రోజులు అవుతున్నా కూడా వస్తువులు రాకపోవడంతో బాధితురాలు రాచకొండ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి నిందితురాలిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News