Friday, November 22, 2024

రాచకొండ భారీగా ట్రాఫిక్ ఉల్లంఘనలు

- Advertisement -
- Advertisement -

Rachakonda Massive traffic violations

వారం రోజులు స్పెషల్ డ్రైవ్
రూ.1,37,28,710 జరిమానా విధింపు
34,042 కేసులు నమోదు చేసిన పోలీసులు

హైదరాబాద్: ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై రాచకొండ పోలీసులు కొరడా జులిపిస్తున్నారు. వారిపై భారీగా కేసులు నమోదు చేయడమే కాకుండా, జరిమానా విధిస్తున్నారు. ఈ నెల 18వ తేదీ నుంచి 24వ తేదీ వరకు నిర్వహించిన స్పెషల్ డ్రైవ్‌లో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులపై 34,042 కేసులు నమోదు చేశారు. వివిధ నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులకు రూ.1,37,28,710 జరిమానా విధించారు. రాచకొండ ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన స్పెషల్ డ్రైవ్‌లో హెల్మెట్ పెట్టుకోకుండా మోటార్ సైకిల్‌ను నడిపిన 19,866మంది కేసులు నమోదు చేసి రూ.36,45,300 జరిమానా విధించారు.

సీటు బెల్ట్ పెట్టుకోకుండా వాహనాలు నడిపిన వారిపై 130 కేసులు నమోదు చేసి, 13,000 రూపాయలు జరిమానా విధించారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడుపుతున్న వారిపై 1,095 కేసులు నమోదు చేశారు, వారికి రూ.3,71,500 జరిమానా విధించారు. వాహనాల్లో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకున్న వారిపై 55 కేసులు నమోదు చేసి, రూ.10,300 జరిమానా విధించారు. ఎక్స్‌ట్రా ఫిట్టింగ్స్ చేసుకున్న వారిపై 915 కేసులు నమోదు చేసి రూ.1,07, 700 జరిమానా విధించారు. ఓవర్ స్పీడ్‌గా వాహనాలు నడిపిన వారికి 1,987 కేసులు నమోదు చేసి రూ.19,87,000 జరిమానా విధించారు. సిగ్నల్ జంప్ చేసిన 51మందికి రూ.5,100 జరిమానా విధించారు. డేంజరస్ డ్రైవింగ్ చేసిన వారికి 15 కేసులు నమోదు చేసి రూ.15,000 జరిమానా విధించారు. మొబైల్ ఫోన్‌లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేసిన వారిపై 66పై కేసులు నమోదు చేసి, రూ.66,000 జరిమానా విధించారు.

డ్రంక్ అండ్ డ్రైవ్…

మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారిపై పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. మద్యం తాగి వాహనాలు నడపడంతో రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. స్పెషల్ డ్రైవ్‌లో మద్యం తాగి వాహనాలు నడుపుతున్న 413మందిపై కేసులు నమోదు చేశారు. మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డవారిని పోలీసులు కోర్టులో హాజరుపర్చగా రూ.8,47,500 జరిమానా విధించారు. మందుబాబుల్లో 20మందికి కోర్టు జైలు విక్ష విధించింది. మద్యం తాగి పట్టుబడిన ఉద్యోగులు పనిచేస్తున్న సంస్థలకు పోలీసులు ఉత్తరాలు రాసి విషయం తెలిసేలా చేశారు. రోడ్డు భద్రత గురించి మీ ఉద్యోగులకు అవగాహన కల్పించాలని కోరారు. ఉప్పల్, మల్కాజ్‌గిరి, ఎల్‌బి నగర్, వనస్థలిపురం, చౌటుప్పల్, భువనగిరి, కుషాయిగూడ, యాదాద్రిలో డ్రంక్ అండ్ డ్రైవ్ చేపట్టారు. ఉప్పల్‌లో అత్యధికంగా 90 కేసులు నమోదు చేశారు. మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారిలో టూవీలర్లు 345మంది ఉన్నారు.

ట్రాఫిక్‌పై అవగాహన తరగతులు…

వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించకుండా ఉండేందుకు రాచకొండ పోలీసులు పలు అవగాహన కార్యాక్రమాలు నిర్వహిస్తున్నారు. యాక్సిడెంట్ ఫ్రీ సొసైటీ పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రజలు, విద్యార్థులు, డ్రైవర్లకు అవగాహన కల్పించి రోడ్డు ప్రమాదాలు జరగకుండా చేస్తున్నారు. మద్యం తాగి వాహనాలు నడిపి పట్టుబడిన వారికి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇస్తున్నారు. వారం రోజుల్లో నిర్వహించిన 90 కార్యక్రమాల్లో 2,112మంది పాల్గొన్నారు. మద్యంతాగి వాహనాలు నడిపిన వారికి ఆరు కార్యక్రమాలు నిర్వహించారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిర్వహించిన వారం రోజుల స్పెషల్ డ్రైవ్‌లో 100 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఇందులో 15మంది పాదచారులు, మిగతావరు 85మంది ఉన్నారు. రోడ్డు ప్రమాదాల్లో 15మంది గాయపడగా, 88మంది మృతిచెందారు. డ్రైవర్ల నిర్లక్షం, అధిక స్పీడ్‌తో వాహనాలను నడపడం, మద్యం తాగి డ్రైవ్ చేయడం, బైక్‌లు స్కిడ్ అయి మృతిచెందుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News