Saturday, April 5, 2025

స్నేహితుడి ప్రాణం తీసిన చికెన్ ఫ్రై

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: చికెన్ ఫ్రై విషయంలో ఇద్దరు మధ్య గొడవ జరగడంతో తనతో పని చేసే వ్యక్తిని ఇటుకతో కొట్టి చంపిన సంఘటన రాచకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. బిహార్‌కు చెందిన సుశీల్ గోస్వామి, ధీరజ్ మండల్ అనే వ్యక్తులు ఇటుక బట్టీలో పని చేస్తున్నారు. ఇద్దరు కలిసిమెలిసి స్నేహంగా ఉండేవారు. చికెన్ ఫ్రై విషయంలో ఇద్దరు మధ్య గొడవ జరగడంతో తారాస్థాయికి చేరుకుంది. ధీరజ్‌ను సుశీల్ గోస్వామి రాయితో బాదడంతో అతడు ఘటనా స్థలంలో చనిపోయాడు. ఇటు బట్టీ యజమాని శామల నరిసింహా రెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని ఎనిమిది గంటలలో నిందితుడిని పట్టుకున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read: చల్లపల్లిలో యువకుడి గొంతుకోసి…

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News