Thursday, January 23, 2025

రాచకొండ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్

- Advertisement -
- Advertisement -

నిబంధనలకు విరుద్దంగా నడిపే వాహనాలపై కేసులు నమోదు

 

మన తెలంగాణ,సిటీబ్యూరో: నగరంలో నేరాల తగ్గించడంలో భాగంగా స్నాచింగ్, రోడ్డు ప్రమాదాలపై రాచకొండ ట్రాఫిక్ పోలీసులు మూడు ట్రాఫిక్ డివిజన్లలో ప్రత్యేక డ్రైవ్ విజయవంతంగా నిర్వహించారు. డ్రంక్ అండ్ డ్రైవ్, నంబర్ ప్లేట్లు, నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించే వారిపట్ల కఠిన చర్యలు ఉంటాయని రాచకొండ ట్రాఫిక్ డిసీపి శ్రీనివాస్ పేర్కొన్నారు. మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వారం రోజుల పాటు నిర్వహించిన డ్రైవ్‌లో ప్లేట్ సరికాని సంఖ్య, క్రమ రహిత సంఖ్య, టాంపర్డ్ నంబర్ వాహనాలపై 2925 కేసులు నమోదు చేసి వాహనాలను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు.

105 స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహించినట్లు అక్రమణ కేసులు 509, హెల్మెట్ లేకుండా నమోదు చేసిన కేసులు 27,467, (39)బి చిన్న కేసులు 509, వెహికల్ లిప్టింగ్ కేసులు 264, సెల్‌పోన్ డ్రైవింగ్ కేసులు 87, ట్రిపుల్ రైడింగ్ కేసులు 441 చేసినట్లు తెలిపారు. కమీషనరేట్ పరిధిలో 644 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు, పాత కేసులతో సహా 992 మందికి డ్రంక్ డ్రైవ్ కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. వీటిలో 26 మందికి శిక్షపడిందని, ఒక రోజు నుంచి 5 రోజుల వరకు జైలు శిక్ష 20 మందికి, సమాజసేవ విధించినట్లు చెప్పారు. నగర వాహనదారులు ఎంవీ చట్టం నిబంధనల ప్రకారం తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్, చెల్లుబాటు అయ్యే పత్రాలు కలిగి ఉండాలని సూచించారు. నెంబర్ ప్లేట్లు లేకుండా తిరుగుతూ పోలీసులకు చిక్కినప్పుడు విధులకు ఇబ్బందులు కలిగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News