Thursday, January 23, 2025

’రేచెల్’ టీజర్ విడుదల

- Advertisement -
- Advertisement -

హనీ రోజ్ లీడ్ రోల్ లో నటిస్తున్న ’రేచెల్’ టీజర్ విడుదలైంది. వయోలెన్స్, బ్లడ్‌షెడ్‌తో కూడిన కథగా ఈ చిత్రం ఉంటుందని టీజర్ హింట్ ఇస్తోంది. ప్రముఖ దర్శకుడు అబ్రిడ్ షైన్ సహ నిర్మాతగా, సహ రచయితగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి నూతన దర్శకురాలు ఆనందిని బాలా దర్శకత్వం వహించారు. యాక్టింగ్ ఫీల్డ్‌లో హనీ రోజ్‌కి ఉన్న నైపుణ్యాన్ని, అనుభవాన్ని ఈ సినిమా ఉపయోగించుకోనుందని ఈ టీజర్ చూస్తే అర్ధమవుతోంది. ఈ చిత్రాన్ని మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని బాదుషా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బాదుషా ఎన్‌ఎమ్, రాజన్ చిరాయిల్, అబ్రిడ్ షైన్ నిర్మించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News