- Advertisement -
నైరోబీ: ఇథియోపియాలో జాతుల ఘర్షనల్లో దాదాపు 230మంది బలయ్యారు. ఒరోమియా రీజియన్ లో ఈ ఘర్షనలు చోటుచేసుకున్నాయి. ఈ నరమేధానికి ఓ తిరుగుబాటు సంస్థే కారణమన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మేము మా జీవిత కాలంలో చూసిన పౌరులపై జరిగిన అత్యంత ఘోరమైన దాడి ఇదేనని గింబీ కౌంటీకి చెందిన అబ్దుల్ సీద్ తాహిర్ చెప్పారు. తాజా మారణ హోమానికి ఒరోమో లిబరేషన్ ఆర్మీదే బాధ్యత అని ఇద్దరు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ఆరోపణలను ఒఎల్ఎ అధికార ప్రతినిధి ఒడ్డా తర్బీ ఖండించారు.
- Advertisement -