Friday, November 22, 2024

జీవవైవిధ్యానికి రా‘ఢర్’

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : భారత నావికాదళం హైదరాబాద్‌కు 75 కిలోమీటర్ల దూరంలో ఉన్న దామగుండం అటవీ ప్రాం తం లో మూడు వేల ఎకరాల అటవీ భూముల విస్తీర్ణంలో నిర్మించతలపెట్టిన రాడార్ కేంద్రానికి వ్యతిరేకంగా జర్నలిస్టులు, మేధావులు గళమెత్తిన అంశానికి బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెపిడెంట్, మాజీ మంత్రి కెటి రామారావు కూడా సంపూర్ణ మద్దతును తెలిపారు. ఈ రాడార్ కేంద్రం మూలంగా మూసీనదితో సహా 12 లక్షల చెట్లు, 20 గ్రామాలు, 60 వేల మంది జనాభా, అనేక జంతువులు, పక్షులతో పాటుగా ఏకంగా మూడు నదులపై ప్రతికూల ప్రభావం చూపుతుందని మేధావులు, జర్నలిస్టులు వెల్లడించిన అంశాలకు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా కెటిఆర్ తన సంపూర్ణ మద్దతు తెలిపారు. రాడార్ కమ్యూనికేషన్ వ్యవస్థను నిర్మించడం మూలంగా దాదాపు మూడు వేల ఎకరాల అటవీ ప్రాంతం అంతరించిపోతుందని, అందుచేతనే ఈ రాడార్ కేంద్రం నిర్మాణాన్ని ఉపసంహరించుకునే అంశంపై పునరాలోచన చేయాలని జర్నలిస్టులతో సహా అనేకమంది మేధావులు, పర్యావరణవేత్తలు ముక్తకంఠంతో ఘోషిస్తున్న తీరుపై మాజీ మంత్రి కెటిఆర్ రీట్వీట్ చేశారు. ప్రజాసంక్షేమం, పర్యావరణ పరిరక్షణ కోసం మేధావులు చేస్తున్న విజ్ఞప్తులను గౌరవించాలని కెటిఆర్ రీ ట్వీట్‌లో కేంద్రాన్ని కోరారు. రాడార్ కేంద్రాన్ని నిర్మించకూడదనే విన్నపాలను పునఃపరిశీలించాలనే జర్నలిస్టులు, మేధావుల అభిప్రాయంతో కెటిఆర్ ఏకీభవించారు.

ఇందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే& పాత్రికేయులు రాసిన అనేక కథనాల్లో “అడవితో ప్రజలకు, పశుపక్షాదులు, జంతువులకున్న అనుబంధాలను వర్ణించిన స్టోరీలను కెటిఆర్ ఉటంకించారు. “ఈ అడవి మా జీవనాధారం… అని 55 ఏళ్ల రైతు కె.శంకర్ నాయక్ అన్నారు, తెలంగాణాలోని అనంతగిరి కొండలలోని దట్టమైన దామగుండం అడవిలో ఒక పెద్ద మర్రి చెట్టు కింద కూర్చుని ఉన్నారని, తన చిన్ననాటి రోజుల్లో, నాయక్ దాని కొమ్మలకు వేలాడుతూ గంటలసేపు గడిపాడని&నాయక్ ఆవేదన వ్యక్తంచేసిన అంశాలను గుర్తుచేశారు. ఇప్పుడు మా పశువులు ఇక్కడ మేస్తున్నాయని నాయక్ చెప్పారని, ఇప్పుడు తనకెంతో ఇష్టమైన దామగుండం ‘అడవి’ (అడవి)ని బలి ఇస్తే ఏమీ మిగలదు” అని ఆయన కంటతడి పెట్టారని జర్నలిస్ట్ అమీషా రజని తన కథనంలో వెల్లడించిన అంశాన్ని కెటిఆర్ ఎక్స్‌లో పేర్కొన్నారు. హైదరాబాద్‌కు కేవలం 75 కిలోమీటర్ల దూరంలో మూడువేల ఎకరాల్లో విస్తరించి ఉన్న 1,000 ఏళ్ల అటవీ సరిహద్దులో ఉన్న 20 గ్రామాలలోని 60 వేల మంది జనాభాకు తీవ్ర నష్టం వాటిల్లనున్నట్లు ఆ కథనంలో జర్నలిస్ట్ అమీషా పేర్కొన్నారని వివరించారు. ఇండియన్ నేవీ వెరీ లో ఫ్రీక్వెన్సీ (విఎల్‌ఎఫ్) రాడార్ కమ్యూనికేషన్ సిస్టమ్‌ను ఏర్పాటు చేయడానికి దామగుండం అడవుల్లోనే స్థలాన్ని గుర్తించిందని, ఈ కేంద్రం నిర్మాణానికి కేంద్ర అటవీ మంత్రిత్వ శాఖతోపాటు తెలంగాణ ప్రభుత్వం నుంచి ఇప్పటికే అనుమతులు కూడా మంజూరయ్యాయని పేర్కొన్నారు. ఈ చర్యకు కారణం జాతీయ భద్రత అని అధికారులు నొక్కిచెప్పినప్పటికీ, స్థానిక ప్రజలు, పర్యావరణవేత్తలను ఆమోదింపచేయడంలో ప్రభుత్వం విఫలమైందని కెటిఆర్ పేర్కొన్నారు. రాడార్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి అనేక సంవత్సరాలుగా పెరిగిన సుమారు 12 లక్షల మహావృక్షాలను, చెట్లను తొలగిస్తున్నారని కెటిఆర్ ఆవేదన వ్యక్తంచేశారు. ఈ రాడార్ కేంద్రం మూలంగా పశువులను మేపుకునే అవకాశాలను కోల్పోవడమే కాకుండా, గ్రామాల పొలిమేరలో వ్యవసాయం చేసుకునే వేలాది మంది ప్రజలు తమ జీవనోపాదిని కూడా కోల్పోవాల్సి వస్తోందని స్థానిక పూజారి స్వామి సత్యానంద్ అన్నారని కెటిఆర్ తెలిపారు. “ఈ అడవి మా ఇల్లు. ఈ జంతువులు మా కుటుంబం. ఈ చెట్లు మా స్నేహితులు” అని సమీప గ్రామమైన పూడూర్‌కు చెందిన రైతు మేకల శ్రీనివాస్ యాదవ్ అన్నారన్నారు. ఈ అడవిలోని ఏ చెట్టును అడిగినా, ఏ సెలయేళ్ళను చూసినా.. ఏదైనా జంతువు కనిపించినా, ఏదైనా పక్షి గురించి అడిగినా&వాటితో తమకున్న అనుబంధాన్ని కథలు కథలుగా వర్ణిస్తూ స్థానికులు చెబుతున్నారని, దీన్నిబట్టి ఆ అడవితో ప్రజలకు ఎంతటి అనుబంధం పెనవేసుకొని ఉందో అర్ధమవుతోందని కెటిఆర్ ఆవేదన వ్యక్తంచేశారు. మన స్వంత ఇంటి నుండి మమ్మల్ని బయటకు పంపినట్లు అనిపిస్తుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారన్నారు. గ్రామస్తులు చెప్పిన వివరాల ప్రకారం, దామగుండం అడవిలో 500కి పైగా అరుదైన జాతుల చెట్లు, 150 ఔషధ మొక్కలు, వన్యప్రాణులు మరియు ఎన్నో రకాల పక్షులు ఉన్నాయని కెటిఆర్ పేర్కొన్నారు. అంతేగాక స్థానికుల్లో ఆరోగ్య సంబంధమైన, పర్యావరణ సంబంధమైన అనేక భయాలు కూడా ఉన్నాయన్నారు. విఎల్‌ఎఫ్ వ్యవస్థ ద్వారా విడుదలయ్యే రేడియేషన్ గురించి ప్రస్తావిస్తూ, పర్యావరణవేత్త మరియు దామగుండం ఫారెస్ట్ ప్రొటెక్షన్ సొసైటీ సభ్యుడు మురళీధర్ దేశ్‌పాండే, ప్రపంచంలోని ఇతర ప్రాంతాలలో ఇలాంటి ప్రాజెక్టులపై అనేక అధ్యయనాలు జరిగాయని, వాటి నివేదికలు అనేక చేదు నిజాలను బయటపెట్టాయని, మానవ ఆరోగ్యంపై భారీ రేడియేషన్ యొక్క ప్రతికూల ప్రభావాలు ఉంటాయని నొక్కి చెబుతున్నాయని చెప్పారని కెటిఆర్ వివరించారు. వృక్షజాలం, జంతుజాలం మీద ఈ రేడియేషన్ ప్రభావంతో అల్జీమర్స్, చర్మ వ్యాధులు, పుట్టుక క్యాన్సర్, గర్భ స్రావాలు వంటి వివిధ మానవసంబంధిత ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయని ఆ అధ్యయనాల్లో తేలిందని కెటిఆర్ తెలిపారు. అనూహ్యంగా ప్రకృతిలో సంబంవించే మార్పుల కారణంగా బలమైన గాలులు వీచే సమయంలో పక్షుల మరణాలు, చెట్లు సులభంగా పడిపోవడం వంటి నష్టాలతోపాటుగా, వన్యప్రాణులపై అనేక దుష్పరిణామాలు ఉంటాయని ఆ నివేదికలు స్పష్టంచేశాయని ఆ అధికారి చెప్పినట్లుగా కెటిఆర్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. పెద్ద ఎత్తున చెట్ల నరికివేతపై అధికారులు స్పందిస్తూ, పరిహారంగా 11.7 లక్షల మొక్కలు నాటుతామని ప్రకటించగా, మొలకల పరిపక్వత కోసం తీసుకున్న సమయాన్ని బట్టి అది సహాయపడుతుందా అని దేశ్‌పాండే ఆశ్చర్యపోయారని అన్నారు. రాష్ట్రంలోని మరో ప్రాంతంలో వాటిని మొక్కలను మూలంగా దామగుండం ప్రాంతంలో జరిగే పర్యావరణ నష్టానికి సహేతుకమైన పరిహారం లభించదని ఆయన సూచించారన్నారు. ఈ అడవిలో మూడు ముఖ్యమైన నదులు ఉన్నాయని, ఇసా, కాగ్నా, మూసీనదులకు తీవ్రనష్టం వాటిల్లుతుందని దేశ్‌పాండే ఆందోళన వ్యక్తంచేశారని వివరించారు. అంతేగాక మూసీనదీ అనంతగిరి అడవుల్లోనే జీవం పోసుకుంటుందని, పర్యావరణపరంగా మూసినదికి అత్యంత గడ్డుకాలమే అవుతుందని పేర్కొన్నారు. మూసీ ప్రారంభమయ్యే అనంతగిరుల్లోని దామగుండం అడవులను నాశనం చేయడానికి మీరు అనుమతి ఇస్తున్నప్పుడు నదిని ఎలా రక్షించబోతున్నారు? అటవీ నేల ఎంత గొప్పది, విశిష్టమైనది, భర్తీ చేయలేనిది అనే అంశాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిగణలోకి తీసుకున్నట్లుగా లేదని ప్రముఖ పర్యావరణవేత్త బివి సుబ్బారావు
ప్రశ్నించారని కెటిఆర్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News