Thursday, December 19, 2024

కీలక సమాచారం ఇచ్చిన రాధాకిషన్ రావు

- Advertisement -
- Advertisement -

ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టుయిన మాజీ డిసిపి రాధాకిషన్ రావు మూడు రోజుల విచారణ శనివారం ముగిసింది. పశ్చిమమండలం డిసిపి ఎస్‌ఎం విజయ్‌కుమార్ నేతృత్వంలోని బృందం రాధాకిషన్ రావు నుంచి మూడో రోజు కీలక విషయం రాబట్టినట్లు తెలిసింది. రాజకీయ నాయకులు వారితో ఉన్న సంబంధం గురించి ఆరా తీసినట్లు తెలిసింది. ఫోన్ ట్యాపింగ్ చేయాలని నంబర్లు ఎవరు ఇచ్చారు, వారి వివరాలు అడిగారు. ఇప్పటి వరకు ఎంత మంది రాజకీయ నాయకుల ఫోన్లను ట్యాపింగ్ చేసి విషయం విచారణలో అడిగినట్లు తెలిసింది. ఎన్నికల తర్వాత ట్యాపింగ్ పరికరాల ధ్వంసం గురించి ఆరా తీసినట్లు తెలిసింది. రాధాకిషన్ రావు ఇచ్చిన సమాచారం మేరకు రాజకీయ నాయకులు, ముఖ్యంగా గత ప్రభుత్వం హయంలో చక్రం తిప్పిన ఓ ఎమ్మెల్సీకి నోటీసులు ఇవ్వనున్నట్లు తెలిసింది.

ఆ ఎమ్మెల్సీని విచారిస్తే మరిన్ని విషయాలు బయటకు వస్తాయని పోలీసులు భావిస్తున్నట్లు తెలిసింది. రాధాకిషన్ రావు ఇచ్చిన సమాచారం మేరకు మరి కొంత మందిని అదుపులోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఇటీవలి కాలంలో రాధాకిషన్ రావుపై వచ్చిన ఫిర్యాదుల గురించి పోలీసులు విచారించినట్లు తెలిసింది. టాస్క్‌ఫోర్స్ డిసిపిగా ఉన్న సమయంలో చాలామందిని బెదిరించినట్లు పలు ఆరోపణలు ఉన్నాయి. వాటిపై పోలీసులు విచారిస్తున్నట్లు తెలిసింది. టాస్క్‌ఫోర్స్ డిసిపిగా ఉన్న సమయంలో ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారిని కిడ్నాప్ చేసి తీసుకుని వచ్చి టాస్క్‌ఫోర్స్ కార్యాలయంలో చిత్రహింసలు పెట్టినట్లు బాధితుడు అప్పటి హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో రియల్ ఎస్టేట్ వ్యాపారిపై తుపాకీ పెట్టి బెదిరించినట్లు అప్పట్లో ఆరోపణలు వచ్చాయి.

బంజారాహిల్స్ పిఎస్‌లోనే విచారణ….
రాధాకిషన్ రావుకు బిపి ఎక్కువ కావడంతో పోలీసులు వైద్యులను పిలిపించి చికిత్స చేయించారు. మాజీ డిసిపి ఆరోగ్యం మెరుగుపడడంతో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లోనే ఉంచి పోలీసులు విచారణ చేశారు. ఫోన్ ట్యాపింగ్‌పై వివరాలు అడిగినట్లు తెలిసింది, ముఖ్యంగా రాజకీయ నాయకుల పాత్రపై ఎక్కువగా అడిగి సమాచారం రాబట్టినట్లు తెలిసింది. దాని ఆధారంగా రాజకీయ నాయకులకు నోటీసులు ఇచ్చి విచారణకు పిలవనున్నట్లు తెలిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News