Tuesday, November 5, 2024

పెద్దల ఆదేశాలతోనే ట్యాపింగ్ చేశానని రాధాకిషన్ ఒప్పుకున్నారు: బండి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో రాధాకిషన్ ఏం చెప్పారో పోలీసుల రికార్డులో ఉందని బిజెపి ఎంపి బండి సంజయ్ కుమార్ తెలిపారు. పెద్దల ఆదేశాలతోనే ట్యాపింగ్ చేశామని రాధాకిషన్ ఒప్పుకున్నారని, ఫోన్ ట్యాపింగ్‌లో తాను, సిఎం రేవంత్ రెడ్డి కూడా బాధితులమేనని స్పష్టం చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టులు, రిమాండ్లు అన్నీ జరిగాయని, సిరిసిల్ల కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని,  పోన్ ట్యాపింగ్ కేసులో కెసిఆర్ కుటుంబాన్ని కాపాడాటానికి కరీంనగర్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి ప్రయత్నిస్తున్నారి బండి ఆరోపణలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ అనేది దేశ భద్రతకు సంబంధించిన అంశమన్నారు. బిఆర్ఎస్, కాంగ్రెస్ పాలనకు పెద్దగా తేడా ఏమీ లేదని ఎద్దేవా చేశారు. పార్లమెంట్ ఎన్నికల సమయంలో సిఎం రేవంత్ రెడ్డి రిజర్వేషన్లను అడ్డం పెట్టుకొన రాజకీయం చేస్తున్నారని దుయ్యబట్టారు.

నిజాం రాజ్యంలో నిఖార్సైన హిందువుగా విధులు నిర్వహించిన సాహసి రాజా బహదూర్ వేంకట రామరెడ్డి అని బండి కొనియాడారు. నిజాం రాజ్యంలో నివురుగప్పిన నిప్పులా తెలుగును కాపాడిన ధీశాలి రాజా బహదూర్ వేంకట రామరెడ్డి వర్థంతి సందర్భంగా ఆ మహానీయుడికి ఘన నివాళులర్పించారు.  హైదారాబాద్ కొత్వాల్ గా శాంతి భద్రతలతో పాటు పరిశుభ్రత కోసం అహర్నిశలు కృషి చేసిన సంస్కరణ శీలి అని, హిందువుల సంక్షేమం కోసం ఆయన అజ్ఞాతంగా సంస్కరణలెన్నో చేపట్టారని ప్రశంసించారు.
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News