Thursday, December 19, 2024

ఫోన్ ట్యాపింగ్ కేసు: రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు

- Advertisement -
- Advertisement -

ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట అయిన రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రిమాండ్ రిమార్ట్ లో ట్యాపింగ్ చేసినట్లు రాధాకిషన్ రావు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.

రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్టు ప్రకారం.. “ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు చెప్పినట్లు చేశాం. నల్లగొండ నుంచి మాజీ డిఎస్పీ ప్రణీత్ రావును తీసుకున్నాం. హైదరాబాద్ లో తిరుపతన్న, రాచకొండ నుంచి భుజంగరావు, సైబరాబాద్ నుంచి వేణుగోపాల్ రావు లను నియమించుకున్నాం. దుబ్బాక ఉప ఎన్నికల్లో రఘునందన్ రావు, బందువులకు సంబంధించిన డబ్బులను సీజ్ చేశాం. మునుగోడు ఉప ఎన్నికల్లోనూ రాజగోపాల్ రెడ్డికి సంబంధించిన రూ.3.5కోట్లు స్వాధీనం చేసుకున్నాం. ప్రభాకర్‌రావు ఆదేశాలతోనే భవ్య సిమెంట్ యజమాని ఆనంద్‌ ప్రసాద్‌ నుంచి రూ.70 లక్షలు సీజ్ చేశాం. ఎన్నికల సమయంలో బిఆర్ఎస్ కు సంబంధించిన డబ్బులను టాస్క్ ఫోర్స్ వాహనాలల్లోనే తరలించాం. బిఆర్ఎస్ సుప్రీం బాస్ ఆదేశాలతో ప్రతిపక్ష పార్టీల ఫోన్లు ట్యాపింగ్ చేశాం. బిఆర్ఎస్ లోని కొందరి నాయకుల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేశాం.” అని పోలీస్ కస్టడీలో ఉన్న ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News