Thursday, January 23, 2025

ఫ్యామిలీస్, యూత్‌కు బాగా నచ్చుతోంది..

- Advertisement -
- Advertisement -

Radhe Shyam Movie Success Meet

రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన బిగ్గెస్ట్ లవ్ స్టోరీ రాధే శ్యామ్. 1970ల్లో జరిగే అందమైన ప్రేమకథ ఇది. యువి క్రియేషన్స్ నిర్మించిన ఈ చిత్రం తాజాగా విడుదలై హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటైన విలేకరుల సమావేశంలో చిత్ర దర్శకుడు రాధాకృష్ణ కుమార్ మాట్లాడుతూ “రాధాశ్యామ్ చిత్రానికి అద్భుతమైన స్పందన వస్తోంది. ప్రేక్షకులు ఈ సినిమాను బాగా ఎంజాయ్ చేస్తున్నారు. డిఫరెంట్ లవ్ స్టోరీ ఇది. లవ్, ఎమోషన్స్ ప్రేక్షకులకు మరిచిపోలేని అనుభూతులను అందిస్తున్నాయి. ఫ్యామిలీస్, యూత్‌కు ఈ సినిమా బాగా నచ్చుతోంది. ప్యూర్ లవ్ స్టోరీ ఇది. కథకు తగ్గ మధురమైన సంగీతాన్ని జస్టిన్ ప్రభాకరన్, హృదయానికి హత్తుకునేలా నేపథ్య సంగీతాన్ని తమన్ అందించారు. ఈ చిత్రంలో విక్రమాదిత్యగా ప్రభాస్ అద్భుతంగా నటించారు. ప్రేరణ పాత్రలో పూజాహెగ్డే ఒదిగిపోయింది.

ఈ సినిమాలో 13 నిమిషాల పాటు ఉండే షిప్ ఎపిసోడ్ సీన్ సమ్‌థింగ్ స్పెషల్‌గా ఉంటుంది. ‘రాధేశ్యామ్’లో యాక్షన్ ఉంది కానీ ఫైట్లు లేవు. లవ్, థ్రిల్లింగ్ అంశాలున్నాయి”అని అన్నారు. తమన్ మాట్లాడుతూ “ఈ సినిమా ఫుల్ ఆఫ్ లవ్‌తో తెరకెక్కింది. మ్యూజిక్‌కు మంచి స్కోప్ ఉన్న చిత్రమిది. ప్రభాస్, పూజాహెగ్డే కెమిస్ట్రీ అద్భుతంగా వర్కవుట్ అయింది. ప్రభాస్ లాంటి పెద్ద స్టార్ ఇలాంటి లవ్ స్టోరీలో నటించడం హ్యాపీగా అనిపించింది. దర్శకుడు రాధాకృష్ణ ఈ చిత్రాన్ని సమ్‌థింగ్ స్పెషల్‌గా తెరకెక్కించారు”అని పేర్కొన్నారు.

Radhe Shyam Movie Success Meet

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News