రెబల్ స్టార్ డా. యు.వి. కృష్ణంరాజు సమర్పణలో గ్లోబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో గోపీ కృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్‌తో ‘రాధే శ్యామ్’ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాయి. వంశీ, ప్రమోద్, ప్రసీదలు ఈ పాన్ ఇండియా సినిమాకు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ భారీ విజువల్ వండర్‌ని సంక్రాంతి శుభాకాంక్షలతో జనవరి 14న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా ‘రాధే శ్యామ్’ టెక్నీషియన్స్ చిత్ర దర్శకుడు రాధా కృష్ణ కుమార్, డి.ఓ.పి. మనోజ్ పరమహంస, ప్రొడక్షన్ డిజైనర్ రవీందర్, మ్యూజిక్ డైరెక్టర్ జస్టిన్ ప్రభాకరన్‌లు మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు రాధా కృష్ణకుమార్ మాట్లాడుతూ “ ట్రైలర్ చూసిన వారంతా విఎఫ్‌ఎక్స్ బాగుందని అంటున్నారు. ఈ క్రెడిట్ అంతా కమల్ కన్నన్‌కే దక్కుతుంది. నాకు ఇన్‌స్పిరేషన్ చంద్ర శేఖర్ యేలేటి, ప్రభాస్‌లు. 1970లలో సాగే పీరియాడిక్ మూవీ ఇది. గోపీ కృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ సినిమా చేయడం దర్శకుడిగా గర్వంగా ఫీల్ అవుతున్నాను”అని అన్నారు.
డి.ఓ.పి. మనోజ్ పరమహంస మాట్లాడుతూ.. “చిత్ర నిర్మాతలు ఈ స్క్రిప్ట్‌కు ఏం కావాలో చెప్పమంటూ.. ప్రతి సీన్‌లో ఒక షాట్ అద్భుతంగా రావాలని నా మీద భారం పెట్టారు. ఒక్కక్క షాటే కాదు సినిమా మొత్తం అద్భుతంగా వచ్చింది. ఈ సినిమాను అనేక దేశాల్లో చిత్రీకరించడం వలన ప్రేక్షకులకు ఈ మూవీ వండర్‌ఫుల్ విజువల్ ఫీస్ట్ అవుతుంది”అని తెలిపారు. ప్రొడక్షన్ డిజైనర్ రవీందర్ మాట్లాడుతూ “బ్యూటిఫుల్ లవ్ స్టొరీ ఇది. 1970లో జరిగే లవ్ స్టొరీకి ప్రొడక్షన్ డిజైనర్‌గా వర్క్ చేయడం ఆనందంగా ఉంది”అని పేర్కొన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ జస్టిన్ ప్రభాకరన్ మాట్లాడుతూ “అద్భుతమైన సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్‌గా అవకాశం రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది కష్టమైన పని అయినప్పటికీ మంచి సంగీతాన్ని అందించానని అనుకుంటున్నాను”అని తెలిపారు.
‘Radhe Shyam’ Movie Team Press Meet