Thursday, January 23, 2025

‘రాధే శ్యామ్’ కొత్త ట్రైలర్ కు టైం ఫిక్స్..

- Advertisement -
- Advertisement -

Radhe Shyam Release Trailer on March 2nd

రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ కుమార్ తెరకెక్కిస్తున్న బిగ్గెస్ట్ బడ్జెట్ లవ్ స్టోరీ ‘రాధే శ్యామ్’. పాన్ ఇండియన్ సినిమాను దర్శకుడు రాధాకృష్ణ కుమార్ తెరకెక్కించాడు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ట్రైలర్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది. సంక్రాంతికి విడుదల కావాల్సి ఈ మూవీ కరోనా థర్డ్ వేవ్ కారణంగా వాయిదా పడింది. ప్రస్తుతం కరోనా ప్రభావం తగ్గి, దేశ వ్యాప్తంగా థియేటర్లు తెరుచుకుంటుండడంతో ఈ మూవీని విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. మార్చ్ 11న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. దీంతో మేకర్స్ ప్రమోషన్స్ ప్రారంభిస్తున్నారు. ఇందులో భాగంగా అభిమానుల కోసం రిలీజ్ ట్రైలర్ ను సిద్ధం చేస్తున్నారు. మార్చి 2న ఈ ట్రైలర్ విడుదల చేయనున్నట్లు వెల్లడిస్తూ కొత్త పోస్టర్ ను వదిలారు.

కాగా,1970ల్లో జరిగే అందమైన ప్రేమకథ ఇది. ఇటలీ, హైదరాబాద్‌లోని అద్భుతమైన లొకేషన్స్‌కు తోడు కోట్లాది రూపాయల అత్యద్భుతమైన సెట్స్‌తో యూవీ క్రియేష‌న్స్ ఈ మూవీని నిర్మించింది. రాధే శ్యామ్ సినిమాకు తెలుగులో దర్శకుడు రాజమౌళి. వాయిస్ ఓవర్ ఇస్తున్నారు. అలాగే కన్నడలో శివరాజ్ కుమార్.. మలయాళంలో పృథ్విరాజ్ సుకుమారన్.. తమిళంలో సత్యరాజ్ రాధే శ్యామ్ సినిమా కోసం వాయిస్ ఓవర్ అందించనున్నారు. హిందీలో బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ రాధే శ్యామ్ సినిమాకు వాయిస్ ఓవర్ ఇచ్చారు.

Radhe Shyam Release Trailer on March 2nd

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News