Thursday, January 23, 2025

ఆ నిరీక్షణ నరకప్రాయం: రాధికా ఆప్టే

- Advertisement -
- Advertisement -

ముంబయి : ఒక విమానాశ్రయంలో తన విమానం ఆలస్యం అయిన తరువాత గంటల తరబడి తాను, ఇతర ప్రయాణికులు ఏరోబ్రిడ్జిలో నిర్బంధానికి గురైనట్లు నటి రాధికా ఆప్టే శనివారం ఆరోపించారు. ‘బద్లాపూర్’, ‘అంధాధున్’, ‘ప్యాడ్‌మాన్’, ‘లస్ట్ స్టోరీస్’ వంటి చిత్రాలలో నటించిన రాధికా ఆప్టే తాను అనుభవించిన నరకయాతన గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో వివరించారు. అయితే, ఆమె నగరం, విమానాశ్రయం, విమాన సంస్థ పేర్లను అందులో వెల్లడించలేదు. ‘నేను ఈ పోస్ట్ పెట్టవలసి వచ్చింది. శనివారం ఉదయం 8.30 గంటలకు విమానం ఎక్కవలసి ఉంది. ఇప్పుడు 10.50 అయింది. విమానం ఇంకా ప్రయాణానికి సిద్ధం కాలేదు.

మేము విమానం ఎక్కుతున్నామని చెప్పి ప్రయాణికులు అందరినీ ఎరోబ్రిడ్జిలో చేర్చి తాళం వేశారు’ అని ఆప్టే తెలియజేశారు. ఆ నటి పోస్ట్ దరిమిలా ఇండిగో అధికార ప్రతినిధి మాట్లాడుతూ, ముంబయి నుంచి భువనేశ్వర్ వెళ్లవలసిన తమ సంస్థ విమానం ‘నిర్వహణ కారణాలతో’ ఆలస్యం అయిందని తెలియజేశారు.‘ముంబయి నుంచి భువనేశ్వర్ వెళ్లవలసిన ఫ్లైట్ 6ఇ2301 నిర్వహణ కారణాలతో ఆలస్యం అయింది. ప్రయాణికులకు ఈ ఆలస్యం గురించి సమాచారం ఇవ్వడమైంది. మా ప్రయాణికులు అందరికీ కలిగిని అసౌకర్యానికి మేము హృదయపూర్వకంగా చింతిస్తున్నాం’ అని విమాన సంస్థ అధికార ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిజయజేశారు. ప్రయాణికులు పలువురు తాళం వేసి ఉన్న అద్దాల తలుపు వెనుక కనిపిస్తున్న ఒక వీడియోను ఆప్టే తన పోస్ట్‌లో పంచుకున్నారు,.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News