Monday, December 23, 2024

“ఆపరేషన్ రావణ్”లో ‘జీవిత’గా రాధికా శరత్ కుమార్

- Advertisement -
- Advertisement -

‘పలాస 1978’ చిత్రంతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న హీరో రక్షిత్ అట్లూరి కొత్త చిత్రం “ఆపరేషన్ రావణ్” ఫస్ట్ లుక్ ఇటీవల విడుదలై ఆసక్తి పెంచిన విషయం తెలిసిందే. స్వాతి ముత్యం, స్వాతి కిరణం లాంటి అత్యంత ప్రజాదరణ పొందిన చిత్రాల తరువాత దర్శకుడు వెంకట సత్య చెప్పిన “ఆపరేషన్ రావణ్” స్క్రిప్ట్ నచ్చి నటనకి ప్రాధాన్యం ఉన్న ఎంతో హృద్యమైన ‘జీవిత’ పాత్ర చేశాను అని ఈరోజు జరిగిన క్యారెక్టర్ లుక్ పోస్టర్ రిలీజ్ ఈవెంట్ లో సీనియర్ నటి రాధికా శరత్ కుమార్ చెప్పారు.

Radhika Sarathkumar as Jeevita from Operation Raavanఆవిడ దర్శకుడి గురించి మాట్లాడుతూ తొలి చిత్రం అయినప్పటికీ వెంకట సత్య నా పాత్రని మలిచిన తీరు, చిత్రాన్ని తీర్చిదిద్దిన విధానం ఎంతగానో ఆకట్టుకుందని, తెలుగుతో పాటు ఏక కాలంలో తమిళంలో విడుదలవుతున్న ఈ చిత్రంలో పని చేయడం చాలా సంతోషంగా ఉంది అని అన్నారు. సుధాస్ మీడియా బ్యానర్ మీద ధ్యాన్ అట్లూరి నిర్మిస్తున్న ఈ న్యూ ఏజ్ ఏక్షన్-సస్పెన్స్ థ్రిల్లర్ “ఆపరేషన్ రావణ్”లో రక్షిత్ అట్లూరి సరసన సంగీర్తన విపిన్ హీరోయిన్ గా నటించారు. షూటింగ్ పూర్తి చేసుకుని నిర్మాణంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న చిత్రం మరిన్ని వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News