Sunday, January 19, 2025

‘టిల్లు స్క్వేర్’ నుంచి ‘రాధిక’ సాంగ్ ప్రోమో విడుదల..

- Advertisement -
- Advertisement -

స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ నటిస్తున్న తాజా చిత్రం ‘టిల్లు స్క్వేర్’. ఈ మూవీలో సిద్దుకు జోడీగా అనుమ పరమేశ్వరన్ నటిస్తోంది. ‘డిజె టిల్లు’కు సీక్వెల్ గా ఈ చిత్రం తెరకెక్కతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదలైన పస్ట్ సింగిల్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీ నుంచి రాధిక సాంగ్  ప్రోమోను మేకర్స్ విడుదల చేశారు. చాలా గ్రాండ్ రూపొందించిన ఈ సాంగ్ ప్రోమో ఆకట్టుకుంటోంది. ఈ సాంగ్ పూర్తి లిరికల్ వీడియోను నవంబర్ 27వ తేదీ సాయంత్రం 4.05నిమిషాలకు రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు.

సితార ఎంటర్ టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ తెరకెక్కిస్తున్న ఈ మూవీకి డోనరుడా ఫేం మల్లిక్‌రామ్ దర్శకత్వం వహిస్తున్నారు. రామ్ మిరియాల సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ ఫిబ్రవరి 9, 2024 ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News