Tuesday, November 5, 2024

పాఠ్యాంశాల్లో సమూల మార్పులు

- Advertisement -
- Advertisement -

విద్యార్థుల్లో అభిరుచి,
దయాగుణం, విలువలు
నేర్పడమే లక్షం యువతను
సరైన దిశలో నడిపిస్తే అద్భుత
ఫలితాలు టెక్నాలజీని వారికి
అందుబాటులో ఉంచడంలో
తెలంగాణ టాప్ ఔత్సాహిక
పారిశ్రామికవేత్తలుగా
మార్చడానికి సకల
సదుపాయాలు: మంత్రి కెటిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్ : స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకలు జరుపుకుంటున్న వేళ మహాత్మా గాంధీ బోధనలు బహుళ ప్రాచుర్యంలోకి తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కె. తారకరామారావు అన్నారు. విద్యార్థి దశలోనే సమా జం పట్ల యువతకు అవగాహన తీసుకరావడం కోసం పాఠ్యాంశాల్లో పెద్దఎత్తున మార్పులు తీసుకువస్తామన్నారు. వారిలో అభిరుచి, దయాగుణం, విలువలు నేర్పించేందుకు ప్రయత్నిస్తామన్నారు. యువతను స రైన దిశలో నడిపిస్తే అద్భుతమైన ఫలితాలు సాధించడానికి అవకాశముంటుందన్నారు. ఈ నేపథ్యంలో నే రాష్ట్ర ప్రభుత్వం యువతకు అ త్యంత ప్రాధాన్యతను ఇస్తోందన్నా రు.

మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతిక రంగంలో వస్తున్న అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని యువత ముంగిటకు తీసుకరావడంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో కొనసాగుతోందన్నా రు. జిల్లా నందిగామ మండలంలో కన్హా శాంతి వనంలో యునెస్కో ఎంజిఐఇపి, ఎఐసిటిఇ ఆధ్వర్యంలో మూడు రోజుల అంతర్జాతీయ యువజన సదస్సును కెటిఆర్ వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రపంచం పురోగమిస్తున్న తరుణంలో ప్రస్తుతం ప్రపంచానికి కావాల్సింది దయ, కరుణ అని అన్నారు. ఇందుకు మానవాభివృద్ధి కోసం పాటుపడుతున్న వ్యక్తులు, సంస్థలతో కలిసి పనిచేసేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు ముందుకు రావాలని ఆయన అభిలాషించారు. దీని కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా కార్యక్రమాలను రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. అయితే ఇందులో ప్రభుత్వ పాత్ర పరిమితంగానే ఉనప్పటికీ యువతను ప్రోత్సహించేందుకు తమ శక్తి వంచన లేకుండా కృషిచేస్తామన్నారు.

తమదైన లక్ష్యాలను నిర్ధేశించుకుని యువత ముందుకు సాగాలని ఈ సందర్భంగా కెటిఆర్ పిలుపునిచ్చారు. వారిని ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. కన్హా శాంతి వనం సేవలు తెలంగాణకు చాలా అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ కేవలం ఎనిమిది సంవత్సరాల్లోనే అభివృద్ధి పథంలో దూసుకుపోతోందన్నారు. చాలా తక్కువ వ్యవధిలోనే అనే అద్భుతాలు సృష్టిస్తోందన్నారు. దేశంలోని ఏ రాష్ట్రాలు సాధించిన ప్రగతిని మన రాష్ట్రం సాధిస్తోందన్నారు. ఇది రాష్ట్ర ముఖ్యమంత్రిగా కెసిఆర్‌కు పాలనపై ఉన్న పట్టు….దూరదృష్టికి నిదర్శమన్నారు. ప్రధానంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు విస్తృతంగా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. దీని కారణంగానే సాంకేతిక పరిజ్ఞానంలో మన రాష్ట్రం శరవేగంగా దూసుకపోతోందన్నారు. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా మారుతోందన్నారు. ఆవిష్కరణలు, మౌలిక సదుపాయాలు కల్పనకు హైదరాబాద్ పెట్టింది పేరని ఈ సందర్భంగా కెటిఆర్ గుర్తు చేశారు. సిఎం కెసిఆర్ దూరదృష్టితో వ్యవసాయ రంగంలో విప్లవాత్మక పురోగతి సాధించిందని సంతోషం వ్యక్తం చేశారు.

అలాగే పారిశ్రామిక రంగాన్ని పరుగులు తీయించడానికి ఇప్పటి వరకు ఏ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయని విధంగా రాష్ట్రం సెల్ఫ్ ఇండస్ట్రీస్ సర్టిఫికెట్ విధానం (టిఎస్…ఐపాస్) అమల్లోకి తీసుకొచ్చిందన్నారు. దీని వల్ల యువతను ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. కేవలం 15 రోజుల్లో పరిశ్రమల స్థాపనకు అనుమతులు ఇస్తున్నామని కెటిఆర్ వివరించారు. దీని వల్ల చదువుకున్న యువతకు ఉపాధి కోసం నెలల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి రాష్ట్రంలో లేకుండా పోయిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న హరితహారంలో యువత భాగస్వామ్యం కావాలని కోరారు. కొవిడ్-19 నేపథ్యంలో రామచంద్ర మిషన్, కన్హా శాంతి వనం నేతృత్వంలో దాజీ సేవలు అద్భుతమని కెటిఆర్ కొనియాడారు.

అనంతరం ప్రముఖ ధ్యానగురువు కమలేశ్ పటేల్ మాట్లాడుతూ, విద్యా, ఉద్యోగం, ఉపాధి రంగాల్లో యువత ఒత్తిళ్లు అధిగమించాలన్నారు. ధ్యానం ద్వారా దయ, కరుణ అలవరుచుకోవడం ద్వారా నిర్ధేశించుకున్న గొప్ప లక్ష్యాలు చేరుకోవడానికి అవిశ్రాంతంగా కృషి చేయవచ్చని తెలిపారు. సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యునెస్కో ఎంజిఐఇపి డైరెక్టర్ డాక్టర్ అనంత దురైయప్ప, ఏఆర్ రెహమాన్ ఫౌండేషన్ డైరెక్టర్, గాయకురాలు ఖతీజా రెహమాన్ తదితరులు పాల్గొన్నారు. అలాగే పలు దేశాలు, దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి తరలివచ్చిన యవత, విద్యార్థులు తరలిచ్చారు. ఈ సందర్భంగా మూడు జంటలకు దాజీ సమక్షంలో వివాహం జరిగింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News