Tuesday, March 18, 2025

పాక్‌లో అహ్మది వర్గంపై రాడికల్ ఇస్లామిస్ట్ పార్టీ నిరసన

- Advertisement -
- Advertisement -

లాహోర్ : పాకిస్తాన్‌లో ఒక రాడికల్ ఇస్లామిస్ట్ పార్టీ మైనారిటీ అహ్మది వర్గంపై తన కార్యాచరణను తీవ్రతరం చేసింది. పంజాబ్‌లోని పలు నగరాల్లో శుక్రవారం ప్రత్యేక ప్రార్థనలు చేయకుండా ఆ వర్గం సభ్యులను పార్టీ అడ్డుకున్నదని, వారిని వేధింపులకు గురి చేసిందని సోమవారం ఒక మత సంస్థ ఆరోపించింది. క్రితం శుక్రవారం తెహ్రీక్ ఎ లబ్బాయిక్ పాకిస్తాన్ (టిఎల్‌పి) సభ్యులు పంజాబ్‌లోని ఫైసలాబాద్, సర్గోధా, లయ్యాహ్, గుజ్రన్‌వాలా, సియాల్‌కోట్, బహవల్‌పూర్, ఒకారా జిల్లాల్లోని అహ్మదీల ప్రార్థనా మందిరాలను చుట్టుముట్టి, శుక్రవారం ప్రార్థనలు చేయకుండా ఆపేందుకు అహ్మది సభ్యులను బెదరించారని, ‘ముస్లింల ఆచారాన్ని’ పాటించనివ్వలేదని జమాత్ ఎఅహ్మదీయ్యా పాకిస్తాన్ (జెఎపి) తెలియజేసింది. వారు అహ్మదీలకు వ్యతిరేకంగా నినాదాలు కూడా చేశారు. అహ్మదీలను అపవిత్రులుగా వారు పేర్కొన్నారు.

అహ్మదీల ప్రార్థనా మందిరాలను సీల్ చేయాలని వారు పిలుపు ఇచ్చారు. పోలీసులు ఆ ప్రదేశాలకు చేరుకున్నప్పుడు అహ్మదీల ప్రార్థనా మందిరాలను సీల్ చేస్తామని, శుక్రవారం ప్రార్థనలు చేసినందుకు వారిపై కేసులు నమోదు చేస్తామని పోలీసుల వాగ్దానం చేసేంత వరకు తాము తిరిగి వెళ్లబోమని టిఎల్‌పి సభ్యులు చెప్పారు. అయితే, పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ప్రార్థనా స్థలాలను సీల్ చేస్తామని టిఎల్‌పి నిరసనదారులకు పోలీసులు హామీ ఇచ్చారు. పోలీసుల హామీతో నిరసనకారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. అంతకు ముందు పోలీసులు 60 మంది అహ్మదీలపై కేసులు నమోదు చేసి, కరాచీ, దస్కా నగరాల్లో శుక్రవారం ప్రార్థనలు చేసినందుకు 45 మందిని అరెస్టు చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News