Sunday, January 19, 2025

నారిమన్ కన్నుమూత

- Advertisement -
- Advertisement -

ముంబయి : ప్రముఖ రేడియో ప్రసారకర్త, ‘బినాకా గీత్‌మాల’కు ప్రతీకగా నిలచిన అమీన్ సయానీ 91వ ఏట కన్నుమూసినట్లు ఆయన కుమారుడు రాజీల్ సయానీ బుధవారం వెల్లడించారు. అమీన్ సయానీ మంగళవారం రాత్రి గుండె పోటుకు గురయ్యారు. ఆయనను దక్షిణ ముంబయిలోని ఒక ఆసుపత్రికి తీసుకువెళ్లారు కానీ ఆయనను కాపాడ లేక పోయారు. ‘ఆయన హెచ్‌ఎన్ రిలయన్స్ ఆసుపత్రిలో మరణించారు. ఛాతీలో నొప్పిగా ఉన్నట్లు ఆయన చెప్పిన తరువాత మంగళవారం రాత్రి 6 గంటలకు ఆసుపత్రికి వెంటనే తరలించాం. ఆయన ప్రాణ రక్షణకు వారు ప్రయత్నించారు. కాని రాత్రి సుమారు 7 గంటలకు ఆయన కన్ను మూశారు’ అని రాజీల్ సయానీ తెలియజేశారు. అంత్యక్రియలు గురువారం జరుగుతాయని, కుటుంబం త్వరలోనే ఒక ప్రకటన విడుదల చేస్తుందని రాజీల్ తెలిపారు.

రేడియో సిలోన్‌లో ‘నమస్తే బెహనో ఔర్ భాయియోఁ, మై ఆప్‌కా దోస్త్ అమీన్ సయానీ బోల్ రహా హూఁ’ అన్న సయానీ స్వీయ పరిచయం శ్రోతలకు ఇప్పటికీ బాగా గుర్తు ఉంటుంది.ఆయన 1932 డిసెంబర్ 21న ముంబయిలో బహు భాషా కుటుంబంలో జన్మించారు. ఆయనకు బాల్యం నుంచే సృజనాత్మక రచన శక్తి ఉన్నది. కేవలం 13 ఏళ్ల వయస్సులో ఆయన తన తల్లి పక్షపత్రిక ‘రెహ్‌బార్’ కోసం రాయడం ప్రారంభించారు. అదే వయస్సులో ఆయన ఇంగ్లీష్‌లో ధారాళంగా మాట్లాడసాగారు. ఆకాశవాణి బొంబాయి కేంద్రం ఇంగ్లీష్ విభాగంలో పిల్లల కార్యక్రమాల్లో పాల్గొననారంభించారు. అఇతే, హిందుస్థానీలో కార్యక్రమం సమర్పణకు ఆడిషన్‌లో సయానీని తిరస్కరించారు. ఆయన వాణిలో గుజరాతీ యాస స్వల్పంగా వినిపించేది. అప్పటి కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి బివి కేస్కర్ ఎఐఆర్‌లో హిందీ పాటలను నిషేధించినప్పుడు రేడియో సిలోన్ ప్రజాదరణ పొందసాగింది.

రేడియో సిలోన్ ప్రసారాలు అప్పట్లో కొలంబో నుంచి జరిగేవి. అవి బహుళ ప్రజాదరణ పొందాయి. 1952 డిసెంబర్‌లో రేడియో సిలోన్‌లో ‘బినాకా గీత్‌మాల’ ఆతిథ్యానికి సయానీకి అవకాశం లభించింది.అంతే ఆయన వెనుకకు తిరిగి చూడవలసిన అవసరం రాలేదు. ఆ తరహా కార్యక్రమం మరేది లేకపోవడంతో ఆ కార్యక్రమం 1952 నుంచి 1994 వరకు 42 సుదీర్ఘ సంవత్సరాల పాటు భారీ జనాదరణతో కొనసాగింది. ఆ కార్యక్రమం పేర్లు మారినా అది 2000 దశకం ఆరంభంలో కూడా శ్రోతలను అమితంగా ఆకట్టుకున్నది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News