Wednesday, January 22, 2025

దుబాయ్‌లో కొత్త స్టేషన్ సౌండ్‌ను ఆవిష్కరించిన రేడియో సిటీ

- Advertisement -
- Advertisement -

ప్రముఖ రేడియో నెట్‌వర్క్ అయిన రేడియో సిటీ అధికారికంగా Rag Rag Mein Daude City’ ’ #CityLoKothaVibe యొక్క ఆధునిక వెర్షన్‌ను విడుదల చేసింది . అత్యంత ఉత్సాహపూరితమైన కొత్త ట్రాక్ ప్రేక్షకులను, ముఖ్యంగా ‘Gen Z’ తరాన్ని ఆకట్టుకునేలా తీర్చిదిద్దబడింది. ఈ విడుదల కార్యక్రమం దుబాయ్‌లో జూన్ 9 నుండి 11 వరకు రేడియో సిటీ బిజినెస్ టైటాన్స్ ఈవెంట్‌ జరిగిన సమయంలో జరిగింది.

మారుతున్న ప్రేక్షకుల నాడిని ఒడిసి పట్టుకోవడానికి ప్రసిద్ధి చెందిన రేడియో సిటీ, తమ అనుభవాల్లో నవ్యత కోరుకునే యువ మరియు ఉత్సాహవంతులైన Gen Z ప్రేక్షకులను అలరించడానికి కొత్త స్టేషన్ సంగీతాన్ని రూపొందించింది. ఇది 39 మార్కెట్‌లలోని ప్రేక్షకులకు పరిపూర్ణమైన అనుభూతిని కలిగిస్తుంది.

ఈ ఆకర్షణీయమైన జింగిల్‌కి ప్రాణం పోసేందుకు, రేడియో సిటీ ఇద్దరు అసాధారణ గాయకులు, లాలస రాచపూడి మరియు ఎల్‌వి రేవంత్‌లతో జతకట్టింది. ఈ ద్వయం జింగిల్‌ను డైనమిక్ మరియు ఎనర్జిటిక్ టచ్‌తో నింపి, ఆసక్తిగల సంగీత ప్రియులకు మరపురాని సంగీత అనుభూతిని అందిస్తుంది.

రేడియో సిటీ సీఈఓ శ్రీ అషిత్ కుకియాన్ మాట్లాడుతూ, “రేడియో సిటీలో, మేము ఎల్లప్పుడూ అర్థవంతమైన మార్గాల్లో అందరి కంటే ముందు ఉండేందుకు ప్రయత్నిస్తాము. ఈ వినూత్నమైన జింగిల్, మా ప్రేక్షకుల, ప్రత్యేకించి ‘Gen Z’ విభాగపు మారుతున్న ప్రాధాన్యతలతో నిమగ్నమవ్వడానికి మా నిబద్ధతను సూచిస్తుంది. Rag Rag Mein Daude City #CityLoKothaVibe యొక్క కొత్త వెర్షన్ రేడియో సిటీ యొక్క కొత్త స్ఫూర్తిని మరియు మా అంకితభావాన్ని ప్రతిబింబిస్తుందని మేము విశ్వసిస్తున్నాము..”అని అన్నారు.

గాయకుడు ఎల్‌వి రేవంత్ మాట్లాడుతూ, “రేడియో సిటీ యొక్క కొత్త స్టేషన్ సౌండ్ మార్పులో భాగం కావడం ఆనందం గా వుంది . ఈ జింగిల్ శ్రోతలను ఉత్తేజపరుస్తుందని మరియు వారికి చిరస్మరణీయమైన సంగీత అనుభవాన్ని అందిస్తుందని నేను నమ్ముతున్నాను” అని అన్నారు.

ప్రముఖ గాయని లాలస రాచపూడి మాట్లాడుతూ.. ” రేడియో సిటీ సూపర్ సింగర్ సీజన్ 13 విజేతగా, వారి విప్లవాత్మక మార్పులో భాగం కావడం ప్రత్యేకమైనది. ఈ జింగిల్ Gen Zలో అభిమానుల అభిమానాన్ని పొందుతుందని నేను విశ్వసిస్తున్నాను.” అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News