ర్యాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో కీలక విషయాలు బయటపడ్డాయి. డ్రగ్స్ పెడ్లర్ మీర్జా వాహిద్ బేగ్ రిమాండ్ రిపోర్టును పోలీసులు విడుదల చేశారు. ప్రధాన నిందితుడు వివేకానంద్ ఆదేశాలతో పెడ్లర్ మీర్జా వాహిద్ బేగ్ ప్రవీణ్ కు డ్రగ్స్ అందించాడు. స్నాప్ చాట్ ద్వారా చాట్ చేస్తూ ఈ ముఠా డ్రగ్స్ సప్లై, డెలివరీ చేస్తోంది. మీర్జా వాహిద్ బేగ్ నుంచి 3.58 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. సయ్యద్ అలీ ద్వారా వివేకానందకు డ్రగ్స్ సరఫరా అవుతున్నట్లు విచారణలో తెలింది.
ఫిబ్రవరిలోనే 10 సార్లు డ్రగ్స్ సరఫరా చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఫిబ్రవరి 24న కొకైన్ పార్టీలో 10 మంది నిందితులు పాల్గొన్నారు. ఫిబ్రవరి 29న కొకైన్ డెలివరీ చేసే సమయంలో నిందితులు అరెస్ట్ అయ్యారు. ఈ నెల 29న గచ్చిబౌలి ఐఎస్ బి వద్ద నిందితులను అరెస్ట్ చేశారు. డ్రగ్స్ పెడ్లర్ అబ్దుల్ రెహమాన్ తో మీర్జా సింగ్ కు ఏడాదిగా పరిచయం ఉంది. ప్రస్తుతం డ్రగ్స్ కేసులో అబ్దుల్ రెహమాన్ ఏ-3గా ఉన్నాడు. మీర్జా స్పాప్ చాట్ లో పరిచయం చేసుకుని డ్రగ్స్ దందా చేస్తోంది. మీర్జా వాహిద్ బేగ్ సయ్యద్ అబ్బాస్ అలీ ద్వారా కొకైన్ విక్రయిస్తున్నాడు. ర్యాడిసన్ హోటల్లో 10 సార్లకు పైగా డ్రగ్స్ పార్టీలు చేసినట్లు పోలీసులు గుర్తించారు.