Tuesday, January 21, 2025

రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో ట్విస్ట్.. నటి లిషి మిస్సింగ్!

- Advertisement -
- Advertisement -

గచ్చిబౌలి రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో ట్విస్ట్ చోటుచేసుకుంది. డ్రగ్స్ కేసులో నిందితురాలిగా ఉన్న నటి లిషి కనిపించడంలేదని ఆమె సోదరి కుషిత పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ డ్రగ్స్ కేసులో పలువురు సినీ సెలబ్రిటీలు కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించిన సంగతి తెలిసిందే. ఈ నెల 24న రాడిసన్ హోటల్ లో ప్రధాన నిందితుడు వివేకానంద్ డ్రగ్స్ పార్టీ నిర్వహించాడని.. ఈ పార్టీలో సెలబ్రిటీలు శ్వేత, నీల్, లిషి, డైరెక్టర్ క్రిష్ కూడా పాల్గొన్నారని పోలీసులు తెలిపారు. వీరంత ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఇక, డ్రగ్స్ కేసు రిపోర్టులో క్రిష్ ను నిందితుడిగా చేర్చుతూ.. ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ముందు విచారణకు వస్తానని తెలిపిన క్రిష్.. ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News