Wednesday, December 25, 2024

రాడిసన్‌ హోటల్ డ్రగ్‌ కేసులో 10మంది విఐపిలపై కేసు నమోదు

- Advertisement -
- Advertisement -

రాడిసన్‌ డ్రగ్‌ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో 10మంది వీఐపీలను గుర్తించిన పోలీసులు.. వారిపై కేసులు నమోదు చేశారు. డ్రగ్స్ పార్టీలో వ్యాపారవేత్తలు వివేకానంద్, అబ్బాస్ తో సహా ఇద్దరు అమ్మాయిలు, 8మందిపై కేసు నమోదు చేశారు. డ్రగ్స్ పార్టీలో కొకైన్ ని పేపర్ లో చుట్టి తీసుకుంటున్నట్లు పోలీసులు గుర్తించారు. మరికొంత మంది ప్రముఖులు ఈ డ్రగ్స్ పార్టీలో పాల్గొన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

ఆదివారం రాత్రి హైదరాబాద్ రాడిసన్ స్టార్ హోటలో డ్రగ్స్ తీసుకుంటూ శేరిలింగంపల్లి బీజేపీ నేత గజ్జల యోగానంద్ కుమారుడు, మంజీర మాల్ ఓనర్ వివేకానంద్ పట్టుబడ్డారు. ఈ కేసులో పోలీసులు చేపట్టిన విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News