Saturday, December 21, 2024

రాడిసన్… డ్రగ్స్ డెన్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/సిటీబ్యూరో : డ్రగ్స్ పార్టీ నిర్వహించిన రాడిసన్ హోటల్‌లో మాదాపూర్ ఎస్‌ఓటి, గచ్చిబౌలి పోలీసులు ఆదివారం రాత్రి దాడి చేశారు. నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకోగా, ఆరుగురు పరారీలో ఉన్నారు. ఇందులో ఇద్దరు యువతులు ఉన్నారు. వారి వద్ద నుంచి ప్లాస్టిక్ కవర్లు, వైట్ కలర్ పేపర్, మూడు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాదాపూ ర్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి వివరాలు వెల్లడించారు. బిజెపి నాయకుడు యోగానంద్ కుమారుడు, వ్యాపారవేత్త గజ్జల వివేకానంద్, సయిద్ అబ్బాస్ అలీ జెఫ్రీ, నిర్భవ్, కేదార్, సందీప్ సెలబ్రిటీ శ్వేత, లిశి, నీల్, నిర్భయ, రఘు, చరణ్ కలిసి కొకైన్‌తో రాడిసన్ హోటల్‌లో డ్రగ్స్ పార్టీ చేసుకున్నారు. అబ్బాస్ గతంలో వివేకానంద్ వద్ద పనిచేయడంతో అతడి వద్ద డ్రగ్స్ కొనుగోలు చేసి తన స్నేహితులతో పార్టీ చేసుకున్నాడు. వీరు కొకైన్‌ను పేపర్‌లో చుట్టి డ్రగ్స్ తీసుకున్నారు. రాడిసన్ హోటల్‌లో డ్రగ్స్ పార్టీ చేసుకుంటున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు దాడి చేశారు. కానీ అప్పటికే డ్రగ్స్ తీసుకున్న వారు ఇంటికి వెళ్లిపోయారు. దీంతో వెంటనే పోలీసులు రాడిసన్ హోటల్ యజమాని, మంజీరా గ్రూప్ డ్రైరెక్టర్ గజ్జల వివేకానంద ఇంటికి వెళ్లారు. జూబ్లీహిల్స్‌లోని వివేకానంద ఇంటికి పోలీసులు వెళ్లడంతో వారిని లోపలికి రాకుండా కొద్దిసేపు అడ్డుకున్నారు. తర్వాత పోలీసులు ఇంటి లోపలికి వెళ్లి వివేకానందను అదుపులోకి తీసుకుని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. నిర్భయ్, కేదార్‌ను కూడా అదుపులోకి తీసుకుని మూత్ర పరీక్ష చేయడంతో పాజిటివ్ వచ్చింది. వారిని అరెస్టు చేసి, మిగతా వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. కేదార్ నగరంలో ఉన్న హై లైఫ్, జూబ్లీ 800 పబ్‌లకు యజమానిగా వ్యవహరిస్తున్నాడు. అలాగే ఈ రెండింటితోపాటు బఫెలో వైల్డ్ వింగ్స్ అనే పబ్‌లో కూడా అతను బిజినెస్ పార్టనర్‌గా ఉన్నట్లు తెలిసింది. వివేకానంద్, నిర్భయ్, కేదార్‌పై 121బి, 27, ఎన్‌డిపిఎస్ యాక్ట్ కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. డ్రగ్స్ విక్రయించి సంపాదించిన ఆస్తులను కూడా అటాచ్ చేస్తామని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి తెలిపారు.
గతంలో పార్టీలు..
రాడిసన్ హోటల్‌లో వివేకానంద్ గతంలో డ్రగ్స్ పార్టీలు చేసుకున్నట్లు పోలీసుల విచారణలో బయటపడింది. వీరికి సయ్యద్ అబ్బాస్ డ్రగ్స్ సప్లయ్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వివేకానంద్ గతంలో సినీనటులకు కూడా డ్రగ్స్ పార్టీ ఇచ్చినట్లు తెలిసింది. పోలీసులు ఆ కోణంలో కూడా విచారణ చేయనున్నట్లు తెలిసింది. కాగా గతంలో వివేకానంద్ తండ్రి యోగానంద్ గంజాయిపై చేసిన ట్విట్ సోషల్ మీడియాలో వైరలవుతోంది. బస్తీ బాట కార్యక్రమంలో భాగంగా వివినగర్ డివిజన్‌లోని రామకృష్ణానగర్‌లో పర్యటించానని, అక్కడి ప్రజలు గంజాయి, ఈవ్ టీజింగ్‌పై ఫిర్యాద చేశారని, పోలీసులకు చెప్పినా పట్టించుకోవడం లేదని చెప్పారని ట్విట్‌ను అప్పటి డిజిపి మహేందర్‌రెడ్డికి ట్యాగ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News