Thursday, December 19, 2024

బ్రిటన్ గగనతలంలో రష్యా ఫైటర్ విమానం

- Advertisement -
- Advertisement -

తమ దేశ గగనతలంలోకి రష్యాకు చెందిన బాంబర్ యుద్ధ విమానం ప్రవేశించడంతో బ్రిటన్ అప్రమత్తం అయింది. వెంటనే తమ ఫైటర్ జెట్స్‌ను సిద్ధం చేసింది. శుక్రవారం ఈ ఘటన జరిగింది. తమ గగనతలంలోకి ప్రవేశించిన రష్యన్ జెట్ విమానం గాలింపునకు బ్రిటన్‌కు చెందిన రాయల్ ఎయిర్‌ఫోర్స్ రంగంలోకి దిగింది. కాగా ఇదే సమయంలో ఇంగ్లీష్ చానల్ జలాల్లో రష్యాకు చెందిన రెండు యుద్ధ నౌకలు చేరుకున్న విషయాన్ని రాయల్ నేవీ ఫోర్స్ పసికట్టింది.

ఈ యుద్ధ నౌకలు, యుద్ధ విమానం ప్రవేశంతో ఎటువంటి పరిస్థితి ఉత్పన్నం అయిందనేది స్పష్టం కాలేదు. ఇటీవలి కాలంలో రష్యా తమ సైన్యం కదలికలను పసిఫిక్, అట్లాంటిక్ గగనతలంలోనూ, యూరప్ పరిధిలోని సముద్ర జల్లాల్లో విస్తృతపర్చుకుంది. రష్యాకు చెందిన బియర్ ఎఫ్ బాంబర్ ప్రవేశించిన వైనంపై బ్రిటన్ రక్షణ మంత్రిత్వశాఖ స్పందించింది. ఇప్పుడే కాకుండా గడిచిన మూడు నెలల్లో ఇటువంటి ఘటనలు ఇంతకు ముందు కూడా జరిగాయని తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News