Wednesday, January 22, 2025

ఇన్ఫోసిస్ బ్రాండ్ అంబాసిడర్‌గా రాఫెల్ నాదల్

- Advertisement -
- Advertisement -

ముంబై : ప్రపంచ లెజెండరీ టెన్నిస్ స్టార్ రాఫెల్ నాదల్ ఐటి కంపెనీ ఇన్ఫోసిస్ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితులయ్యారు. ఈమేరకు కంపెనీ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో రెగ్యులేటరీ ఫైలింగ్‌లో ఈ విషయాన్ని వెల్లడించింది. ఇన్ఫోసిస్ రాఫెల్ నాదల్‌తో 3 సంవత్సరాల ఒప్పందం కుదుర్చుకుంది. బ్రాండ్, డిజిటల్ ఆవిష్కరణలకు నాదల్ అంబాసిడర్‌గా ఉంటారని ఇన్ఫోసిస్ తెలిపింది. స్పెయిన్‌కు చెందిన 37 ఏళ్ల రఫెల్ నాదల్ ఎటిపి ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్ స్థానంలో కొనసాగుతున్నారు. ఆయన 14 ఫ్రెంచ్ ఓపెన్ టైటిళ్లతో సహా 22 గ్రాండ్ స్లాబ్ టోర్నమెంట్లను గెలుచుకున్నాడు.

ఇన్ఫోసిస్‌తో ఒప్పందంపై రాఫెల్ నాదల్ మాట్లాడుతూ, ఇన్ఫోసిస్‌తో సన్నిహితంగా పని చేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. గ్లోబల్ టెన్నిస్‌కు ఇన్ఫోసిస్ తన డిజిటల్ నైపుణ్యాన్ని తీసుకువచ్చిన విధానం నచ్చిందని ఆయన అన్నారు. ఇన్ఫోసిస్ సిఇఒ, ఎండి సలీల్ పారిఖ్ మాట్లాడుతూ, ప్రపంచంలోనే అత్యంత గౌరవనీయమైన చాంపియన్ అథ్లెట్ రఫెల్ నాదల్‌ను కంపెనీ బ్రాండ్ అంబాసిడర్‌గా స్వాగతించడం సంస్థకు గర్వకారణం అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News