Monday, January 20, 2025

ముగిసిన నాదల్ టెన్నిస్ ప్రస్థానం

- Advertisement -
- Advertisement -

స్పెయిన్ దిగ్గజం రఫెల్ టెన్నిస్ కెరీర్ ముగిసింది. డేవిస్ కప్ క్వార్టర్ ఫైనల్లో నెదర్లాండ్స్ చేతిలో స్పెయిన్ పరాజయం చవిచూడడంతో నాదల్ అంతర్జాతీయ కెరీర్‌కు పుల్‌స్టాప్ పడింది. ఒకవేళ ఈ మ్యాచ్‌లో స్పెయిన్ విజయం సాధించి ఉంటే నాదల్ మరి కొంత కాలం పాటు టెన్నిస్‌లో కొనసాగే వాడు. కానీ స్పెయిన్ క్వార్టర్ ఫైనల్లోనే ఓడడంతో నాదల్ తన కెరీర్‌లో చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడేశాడు. నెదర్లాండ్స్ ఆటగాడు బోటిక్ వాన్ డి జాండ్‌స్కల్స్‌తో నాదల్ చివరి మ్యాచ్‌లో ఆడాడు. ఈ మ్యాచ్‌లో నాదల్ 46, 46 తేడాతో పరాజయం చవిచూశాడు. కాగా, రెండో సింగిల్స్ స్పెయిన్ యువ సంచలనం కార్లొస్ అల్కరాజ్ విజయం సాధించాడు. కానీ ఫలితాన్ని తేల్చే డబుల్స్ మ్యాచ్‌లో స్పెయిన్ జంట ఓటమి పాలైంది. దీంతో స్పెయిన్ క్వార్టర్ ఫైనల్లోనే ఇంటిదారి పట్టక తప్పలేదు. కాగా, నాదల్‌కు వీడ్కోలు పలికేందుకు దాదాపు పది వేల మంది మలగా స్పోర్ట్ అరెనాను తరలివచ్చారు. నాదల్ రిటైర్మెంట్‌కు గుర్తింపుగా స్పెయిన్ జాతీయ గీతాన్ని అలపించారు.

ఈ సందర్భంగా నాదల్ భావోద్వేగానికి గరై కన్నీళ్ల పర్యంతమయ్యాడు. కాగా, డేవిస్ కప్ తర్వాత అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలుకుతానని నాదల్ ఇంతకుముందే ప్రకటించాడు. ఇక డేవిస్ కప్‌లో స్పెయిన్ ఓటమి పాలవ్వడంతో నాదల్ కెరీర్ కూడా ముగిసింది. నాదల్ తన కెరీర్‌లో ఎన్నో చిరస్మరణీయ విజయాలు సాధించాడు. 22 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌తో రెండో స్థానంలో నిలిచాడు. సెర్బియా యోధుడు నొవాక్ జకోవిచ్ (24) ఒక్కడే నాదల్ కంటే ఎక్కువ గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సాధించాడు. నాదల్ రిటైర్మెంట్‌పై అతని చిరకాల ప్రత్యర్థి, స్విట్జర్లాండ్ దిగ్గజం రోజర్ ఫెదరర్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. నాదల్‌తో ఆడిన ప్రతి మ్యాచ్ తన కెరీర్‌లో తీపి జ్ఞాపకంగా మిగిలిపోతుందన్నాడు. నాదల్‌లాంటి మిత్రుడు లభించడాన్ని అత్యంత అరుదైన గౌరవంగా భావిస్తున్నానని ఫెదరర్ పేర్కొన్నాడు. ఆటకు వీడ్కోలు పలికినా టెన్నిస్‌పై నాదల్ ముద్ర ఎప్పటికీ చెరగని ముద్రగానే మిగిలిపోతుందన్నాడు. అతనిలాంటి పోరాట యోధుడు మళ్లీ లభించడం చాలా కష్టమని ఫెదరర్ వ్యాఖ్యానించాడు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News