Friday, December 20, 2024

నాదల్‌ను మట్టికరిపించిన మెక్‌డొనాల్డ్

- Advertisement -
- Advertisement -

మెల్‌బోర్న్: ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్‌లో బుధవారం పెను సంచలనం నమోదైంది. టైటిల్ ఫేవరెట్, టాప్ సీడ్ రఫెల్ నాదల్ (స్పెయిన్) రెండో రౌండ్‌లోనే ఇంటిదారి పట్టాడు. అమెరికా ఆటగాడు మెకెన్జి మెక్‌డొనాల్డ్‌తో జరిగిన మ్యాచ్‌లో నాదల్ అనూహ్య ఓటమి పాలయ్యాడు. అసాధారణ ఆటను కనబరిచిన మెక్‌డొనాల్డ్ వరుస సెట్లలో నాదల్‌ను మట్టికరిపించాడు. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన మెక్‌డొనాల్డ్ 64, 64, 75 తేడాతో విజయం సాధించాడు.

అయితే ఇతర పోటీల్లో మూడో సీడ్ సిట్సిపాస్ (గ్రీస్), 11వ సీడ్ నోరి (బ్రిటన్), ఆరో సీడ్ ఫెలిక్స్ అగర్ (కెనడా), జన్నిక్ సిన్నర్ (ఇటలీ), టియాఫొ (అమెరికా) తదితరులు జయకేతనం ఎగుర వేశారు. మహిళల సింగిల్స్‌లో టాప్ సీడ్ ఇగా స్వియాటెక్, ఆరో సీడ్ మారియా సక్కారి, మూడో సీడ్ పెగులా తదితరులు మూడో రౌండ్‌కు చేరుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News