Sunday, January 19, 2025

టెన్నిస్ అభిమానులకు షాక్..

- Advertisement -
- Advertisement -

మెల్‌బోర్న్: త్వరలో ప్రారంభమయ్యే సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఆస్ట్రేలియా ఓపెన్‌కు స్పెయిన్‌బుల్ రఫెల్ నాదల్ దూరమయ్యాడు. గాయం మళ్లీ తిరగబడడంతో అతను ఈ మెగా టోర్నమెంట్ నుంచి తప్పుకోవాలని నిర్ణయించాడు. ఈ విషయాన్ని నాదల్ ట్విటర్ ద్వారా వెల్లడించాడు. ఈ సీజన్ సానుకూల వాతావరణంలో ప్రారంభించాలని భావించిన తనకు గాయం సమస్యగా మారిందన్నాడు. ఇది తనను ఎంతో బాధకు గురిచేసిందన్నాడు. అయితే గతంలో అయినా గాయం మళ్లీ పునరావృతం కాకపోవడం కాస్త ఊరటనిచ్చే అంశమన్నాడు. ప్రస్తుతం ఉన్న గాయం చాలా చిన్నదన్నాడు. దీని నుంచి త్వరలోనే కోలుకుంటాననే నమ్మకం తనకుందున్నాడు.

పూర్తి ఫిట్‌నెస్‌తో మళ్లీ మైదానంలోకి దిగుతానని పేర్కొన్నాడు. బ్రిస్బేన్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ ఆడుతున్న సమయంలో కండరాలకు సంబంధించి సమస్య వచ్చింది. ఈ క్రమంలో ఎంఆర్‌ఐ స్కాన్ తీయించగా కండరాల్లో చిన్నపాటి చీలిక కనిపించింది. అయితే గతంలో ఎక్కడైతే గాయమైందో ఈసారి అక్కడ ఎలాంటి గాయం లేకపోవడం శుభవార్తేనన్నాడు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తాను ఐదు సెట్ల మ్యాచ్‌లు ఆడలేనని, అందువల్లే ఆస్ట్రేలియా ఓపెన్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించినట్టు నాదల్ వెల్లడించాడు. త్వరలోనే స్వదేశం స్పెయిన్‌కు వెళ్లి వ్యక్తిగత డాక్టర్‌ను కలుస్తానని, కొన్ని రోజుల విశ్రాంతి అనంతరం మళ్లీ సాధన మొదలు పెడతాననని స్పెయిన్ బుల్ పేర్కొన్నాడు.

షాక్‌లాంటిదే..
ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు నాదల్ ఆటను చూడాలని భావించారు. ఏడాది కాలంగా గాయంతో నాదల్ ఆటకు దూరంగా ఉన్నాడు. ఈ సీజన్‌లో అతను మైదానంలో బరిలోకి దిగితే చూడాలని అభిమానులు అతృతతో ఎదురు చూశారు. కానీ మళ్లీ గాయం బారిన పడడంతో నాదల్ ఆటకు దూరం కావాల్సి వచ్చింది. ఇది నాదల్ అభిమానులకు షాక్‌కు గురి చేసింది. పురుషుల టెన్నిస్‌లో నాదల్‌కు కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. అతని ఆటకు ఫిదా కానీ వారు లేరంటే అతిశయోక్తి కాదు. పోరాట పటిమకు మరోపేరుగా భావించే రఫెల్ ఇప్పటికే ప్రపంచ టెన్నిస్‌పై తనదైన ముద్ర వేశాడు. 22 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌తో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. అయితే గాయం వల్ల నాదల్ ఈసారి ఆస్ట్రేలియా ఓపెన్‌కు దూరం కావడం అభిమానులకు నిరాశకు గురి చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News