Wednesday, January 22, 2025

బాబోయ్, ఆకాశంలో గుర్తు తెలియని ఎగిరే వస్తువు!

- Advertisement -
- Advertisement -

ప్రపంచ కప్ క్రికెట్ ఫైనల్ మొదలైంది. జనమంతా టీవీలకు అతుక్కుపోయి మరీ చూస్తున్నారు. అదే సమయంలో బయట హడావిడి మొదలైంది. ఆకాశంలో గుర్తు తెలియని వస్తువు ఎగురుతూ ఉండటంతో జనం కంగారు పడిపోయారు. కొంతమంది అది ఎక్కడ తమ మీద పడుతుందేమోనని పరుగు లంకించుకుంటే, ఇంకొందరు ధైర్యంగా దానిని చూస్తూ, కెమెరాలలో బంధించారు. మణిపూర్ రాజధాని ఇంఫాల్ లో ఈ సంఘటన జరిగింది.

ఇంఫాల్ విమానాశ్రయం సమీపంలో ఆకాశంలో ఏదో వస్తువు ఎగురుతున్నట్లు గుర్తించిన కొందరు ఆ విషయాన్ని పోలీసులకు చేరవేశారు. ఈలోగా భారతీయ వాయుదళం అప్రమత్తమైంది. వెంటనే ఇంఫాల్ విమానాశ్రయం నుంచి అత్యంత అధునాతనమైన రఫేల్ యుద్ధ విమానాన్ని రంగంలోకి దించింది. అయితే రఫేల్ ఎంత విస్తృతంగా గాలించినా మళ్లీ ఎగిరే వస్తువులేమీ ఆకాశంలో కనిపించలేదట. ఇప్పుడు ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. మీరూ ఓ లుక్ వేయండి మరి!

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News