Monday, December 23, 2024

ఫైనల్లో నాదల్

- Advertisement -
- Advertisement -

ఇండియన్‌వేల్ మాస్టర్ టెన్నిస్

ఇండియన్‌వేల్స్: ఇండియన్‌వేల్స్ మాస్టర్ టెన్నిస్ టోర్నమెంట్‌లో రాఫెల్ నాదల్ ఫైనల్లో అడుగు పెట్టాడు. పురుషుల విభాగంలో ఆదివారం జరిగిన తొలి సెమీఫైనల్లో స్పెయిన్‌కు చెందిన అన్‌సీడెడ్ కార్లోస్ అల్కరాజ్ గార్ఫియాపై 64, 46, 63తో గెలుపొంది తుదిపోరుకు చేరుకున్నాడు. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో తొలి సెట్‌ను అలవోకగానే స్వాధీనం చేసుకున్న నాదల్ రెండో సెట్‌లో తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొన్నాడు. చెలరేగిన ఆడిన గార్ఫియా 46తో నాదల్‌ను మట్టికరిపించాడు.

దీంతో మ్యాచ్ మరింత ఉత్కంఠగా మారింది. ఇక మూడో సెట్‌లో ఇద్దరూ నువ్వానేనా అన్నట్టుగా పోరాడినా నాదల్ పైచేయి సాధించాడు. గార్ఫియాకు అవకాశమివ్వకుండా మరీ సునాయసంగా 63తో సెట్ గెలవడంతో పాటు మ్యాచ్‌ను కైవసం చేసుకున్నాడు. ఇక పురుషుల విభాగంలో జరిగిన రెండో సెమీఫైనల్ మ్యాచ్‌లో రష్యాకు చెందిన ఆండ్రీ రుబ్లె, అమెరికాకు చెందిన టేలర్ ఫ్రీజ్‌లు తలపడ్డారు. కాగా, ఈ మ్యాచ్‌లో టేలర్ 75, 64తో రుబ్లెను ఓడించి ఫైనల్‌కు చేరుకున్నాడు. వరుస సెట్లతో గెలుపొందిన టేలర్ మంగళవారం జరిగేజరిగే ఫైనల్ మ్యాచ్‌లో నాదల్‌తో పోరుగు దిగనున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News