- రెండు వర్గాల మధ్య వివాదం
- మా షాపులో అంటే మాషాపులోనే తాగాలని టాంకా
చండ్రుగొండ : మద్యం బెల్టషాపు నిర్వహణ మండలంలోని గానుగపాడు గ్రామంలో వివాదాన్ని రేపింది. రెండేళ్ళుగా ఈ గ్రామంలో మద్యం బెల్ట్‌షాపు నిర్వహణ వేలంపాట ద్వారా నిర్ణయిస్తున్నారు. ఈ క్రమంలో ఈ ఏడాది రెండు నెలలక్రితం నిర్వహించిన వేలంపాటలో ఓ వ్యక్తి రూ.3 లక్షలకు పాట పాడారు.ఆ మొత్తం డబ్బులు గ్రామంలోని ఆంజనేయ స్వామి ఆలయాభివృద్ధికి వెచ్చిస్తున్నారు. ఇదిలా ఉండగా గ్రామంలోని మరో సామాజిక వర్గం చర్చి అభివృద్ధికి డబ్బులు ఇవ్వాలని కోరింది.
ఈ విషయమై రెండు వర్గల మధ్య వివాదం రాజుకుంది. దీంతో ఒక వర్గం వారు రెండు రోజుల క్రితం వారు వేలంపాట నిర్వహించుకున్నారు. దింతో మరో వర్గం వారు ఆ బెల్ట్‌షాపులో మద్యం సేవించొద్దని ఈ విషయంలో తమ సామాజికవర్గం వారు ఎవరైనా అతిక్రమించి ఆ బెల్ట్‌షాపులో మద్యం సేవిస్తే జరిమానా విధించబడుతుందని గ్రామంలో టంకా వేయించారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది.