Wednesday, January 22, 2025

ర్యాగింగ్ పేరుతో వికృత చేష్టలు

- Advertisement -
- Advertisement -

Ragging at Indore Medical College

హాస్టల్లో అమ్మాయిలపైనా అఘాయిత్యాలు
ఇండోర్ మెడికల్ కాలేజి సీనియర్ల ఆగడం
దాదాపు పది మందిపై కేసులు నమోదు

ఇండోర్: కాలేజిలో చేరే కొత్త కుర్రాళ్లను జూనియర్లు ర్యాగింగ్ పేరుతో ఏడిపించడం మనం వింటూనే ఉన్నాం. హద్దుమీరనంతవరకు దీన్ని జూనియర్లు కూడా ఎంజాయ్ చేస్తారు. అయితే ఈ ర్యాగింగ్ కొన్ని సందర్భాలో ్లవికృతరూపం దాలుస్తోంది. ర్యాగింగ్ పేరుతో సీనియర్లు చేసే చేష్టలతో జూనియర్లు భయంతో వణికి పోయే పరిస్థితులు కూడా తలెత్తుతూ ఉంటాయి. తాజాగా ఇలాంటి ఘటనే ఇండోర్ మెడికల్ కాలేజిలో చోటు చేసుకుంది. ర్యాగింగ్ పేరుతో సీనియర్లు జూనియర్ల పట్ల వికృత చేష్టలకు దిగారు. జూనియర్ అమ్మాయిలతో కూడా అసభ్యకరంగా ప్రవర్తిస్తూ ఇష్టం వచ్చిన రీతిలో ప్రవర్తించారు. దీంతో పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ మహాత్మాగాంధీ మెడికల్ కాలేజిలో సీనియర్లు ర్యాగింగ్ పేరుతో రెచ్చిపోయారు. హాస్టల్‌లో జూనియర్లను తమ రూమ్‌లలోకి పిలిపించుకుని మితిమీరి ప్రవర్తించారు. దిండ్లతో శృంగారం చేయాలని వారిని బలవంత పెట్టారు. ఈ క్రమంలోనే జూనియర్ అమ్మాయిలతోను అసభ్యకరంగా వ్యవహరించారు. ఒకరినొకరు కొట్టుకోవాలని బెదిరించారు.

దీంతో సీనియర్ల వేధింపులు భరించలేక జూనియర్లు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్‌కు చెందిన యాంటీ ర్యాగింగ్ హెల్ప్‌లైన్ నంబరుకు కాల్ చేసి జరిగిన దారుణాన్ని వివరించారు. విద్యార్థుల ఫిర్యాదును సీరియస్‌గా తీసుకున్న యుజిసి రంగంలోకి దిగి దర్యాప్తు జరిపింది. విద్యార్థులను వేధింపులకు గురి చేసిన సీనియర్లను గుర్తించి తగు చర్యలు తీసుకోవలసిందిగా కాలేజి యాజమాన్యాన్ని ఆదేశించింది. దీంతో పోలీసులు యాంటీ ర్యాగింగ్ యాక్ట్2009 కింద 810 మంది సీనియర్లపై కేసులు నమోదు చేసినట్లు సన్యోగిత గంజ్ పోలీసు స్టేషన్ ఇన్‌చార్జి తెహజీబ్ కాజి తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News