Thursday, January 23, 2025

ర్యాగింగ్ నేరం

- Advertisement -
- Advertisement -

స్కూల్ పిల్లలు మొదలుకొని గ్రాడ్యుయేట్స్ వరకు అందులో ముఖ్యంగా డాక్టర్లు, ఇంజినీర్లు మానసిక క్షోభను భరించలేక, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వరంగల్‌లో డాక్టర్ ప్రీతి తన సీనియర్ విద్యార్థి ర్యాగింగ్ చేయడం వల్ల ఆత్మహత్య చేసుకుంది. ఇలా దేశంలో పలు రాష్ట్రాలలో అనేక మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. ఆస్ట్రేలియా, బ్రిటన్, శ్రీలంక, భారతదేశం మొదలైన దేశాల్లో ఇది ఎక్కువగా ఉంది. డిసెంబరు 17, 1998 సంవత్సరంలో అసోం ప్రభుత్వం పాఠశాలలో ‘ర్యాగింగ్’ను నేరంగా పరిగణిస్తూ చట్టం చేసింది. న్యాయమూర్తులు మార్కండేయ ఖట్జూ, ఎకె గంగూలీ నేతృత్వంలోని ధర్మాసనం ఈ చట్టం చేసింది. ‘అందరూ ఒకే విధమైన మనస్తత్వంతో ఉండరు.

ర్యాగింగ్ అనగా కళాశాలల్లో సీనియర్ విద్యార్థులు కొత్త గా వచ్చిన విద్యార్థులకు మనస్తాపం కలిగించే రీతిలో ప్రవర్తించడం. ఇటీవల కాలంలో అనేక కళాశాలలో సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థులను ర్యాగింగ్ చేయడం వల్ల, జూనియర్ విద్యార్థులు భరించలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. స్కూల్ పిల్లలు మొదలుకొని గ్రాడ్యుయేట్స్ వరకు అందులో ముఖ్యంగా డాక్టర్లు, ఇంజినీర్లు మానసిక క్షోభను భరించలేక, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వరంగల్‌లో డాక్టర్ ప్రీతి తన సీనియర్ విద్యార్థి ర్యాగింగ్ చేయడం వల్ల ఆత్మహత్య చేసుకుంది. ఇలా దేశంలో పలు రాష్ట్రాలలో అనేక మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. ఆస్ట్రేలియా, బ్రిటన్, శ్రీలంక, భారతదేశం మొదలైన దేశాల్లో ఇది ఎక్కువగా ఉంది. డిసెంబరు 17, 1998 సంవత్సరంలో అసోం ప్రభుత్వం పాఠశాలలో ‘ర్యాగింగ్’ను నేరంగా పరిగణిస్తూ చట్టం చేసింది. న్యాయమూర్తులు మార్కండేయ ఖట్జూ, ఎకె గంగూలీ నేతృత్వంలోని ధర్మాసనం ఈ చట్టం చేసింది.

‘అందరూ ఒకే విధమైన మనస్తత్వంతో ఉండరు. కొందరు అత్యంత సున్నిత మనస్కులై చిన్నపాటి విషయాలకే ఉద్రేకానికి గురవుతుంటారు’అని ధర్మాసనం పేర్కొంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ర్యాగింగ్ నిరోధానికి సిబిఐ మాజీ డైరెక్టర్ రాఘవన్ నేతృత్వంలోని కమిటీ చేసిన సూచనల మేరకు కచ్చితమైన చర్యలు తీసుకోవాల్సిందిగా అన్ని యూనివర్సిటీలకు ఆదేశాలిచ్చినట్లు సొలిసిటర్ జనరల్ గోపాల్ సుబ్రహ్మణ్యం బెంచ్ దృష్టికి తీసుకెళ్ళింది.కొత్తగా కళాశాలల్లో ప్రవేశం పొందిన జూనియర్ విద్యార్థులను సీనియర్ విద్యార్థులు భౌతిక, మానసిక వేధింపులకు, ఆకతాయి చర్యలకు గురిచేయడం, బాధిత జూనియర్ విద్యార్థులు మధ్యలో చదువు మానేయడం, మరికొన్ని సందర్భాలలో ఆత్మహత్యలకు పాల్పడటం జరుగుతున్నది.ఈ దుస్సంఘటనలను పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు, ర్యాగింగ్ విష సంస్కృతిని కఠినంగా అణచివేయాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తూ విశ్వజాగృతి మిషన్ కేసులో కొన్ని ముఖ్యమైన సూచనలను చేసింది. ఈ సూచనల ప్రకారం అన్ని కళాశాలలూ, వృత్తి విద్యా సంస్థలు తమ తమ కళాశాలల ఆవరణలో ప్రకటన బోర్దులను ఏర్పరచడం, తమ కళాశాలలో చేరబోయే విద్యార్థులకు అందజేసే ప్రాస్పక్టస్‌లో ర్యాగింగ్ పూర్తిగా నిషేధించబడిందనీ, ర్యాగింగ్‌కి పాల్ప డే విద్యార్థులకు కాలేజీ నుండి సస్పెన్షన్, విద్యా సంవత్సరం పూర్తి కాకుండానే పంపివేయడం, జరిమానా, బహిరంగ క్షమాపణ చెప్పటం వంటి కఠినమైన శిక్షలు విధించబడతాయని స్పష్టం చేయాలి.

ఈ శిక్షలలో భాగంగా విద్యార్థి ఉపకార వేతనాలు, ఇతర సంక్షేమ సౌకర్యాల నిలిపివేత, కళాశాల ఉత్సవాలలో పాల్గొనకుండా,పరీక్షా ఫలితాల నిలుపుదల, వసతి గృహం నుండి గెంటివేత వంటి కఠిన చర్యలు కూడా తీసుకోబడతాయి.ఇంకా కొత్తగా చేరబోయే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు లేదా సంరక్షకుడు నుండి కూడా తాము ర్యాగింగ్ నేరానికి పాల్పడబోమని హామీ పత్రం కళాశాల అధికార వర్గాలు పొందుతాయి. ఇదే రకమైన హామీని సీనియర్ విద్యార్థుల నుండి, వారి తల్లిదండ్రులు, సంరక్షకుల నుండి కూడా పొందవచ్చు. సుప్రీంకోర్టు సూచనల ప్రకారం ఏ విద్యార్థి అయినా ర్యాగింగ్ బారిన పడినపుడు అవసరమైన సహాయం కోసం ఎవరిని సంప్రదించాలో కూడా కళాశాల యాజమాన్యం కరపత్రాలు, ఇతర విధానాల ద్వారా విద్యారులకు తెలియజేయాలి. ఇలా సహాయం చేసే అధికారి చిరునామా, టెలిఫోన్ నెంబర్లు కూడా విద్యార్థులకు తెలియజేయాలి. కళాశాల యాజమాన్యం, ప్రిన్సిపాల్, ఇతర అధ్యాపకులు తరచూ కొత్తగా చేరిన విద్యార్థులతో సంప్రదిస్తూ వారిలో ర్యాగింగ్ మహమ్మారిని వ్యతిరేకించే విధంగా ఆత్మవిశ్వాసం, ధైర్యం పెంపొందించాలి. ఈ తీర్పు ప్రకారం ఏ కళాశాలలోనైనా ర్యాగింగ్ జరిగినట్లయితే యాజమా న్యం, ప్రిన్సిపాల్ బాధ్యత వహించాలి.

సుప్రీంకోరు ఉత్తర్వుల ప్రకారం ర్యాగింగ్‌ను అరికట్టేందుకు జాతీయ స్థాయిలో ఒక కమిటీ ఏర్పాటయింది. ఏ చర్య ద్వారానైనా ఒక విద్యార్ధికి అవమానం లేదా భయం కలగడం, అవహేళనలకు గురైనందువల్ల గౌరవభంగం వంటి మానసిక, దైహికగాయాలు కలగజేయటం ర్యాగింగ్ అనే నేరం గా ఈ చట్టం పేర్కొన్నది. 8 చట్టంలోని అంశాలు వర్తించే విద్యాసంస్థలు, కళాశాలలు, విద్యను బోధించే ఏ సంస్థ అయినా అనాథ శరణాలయం, విద్యార్థి వసతి గృహం, ట్యుటోరియల్, కాలేజీ వంటి విభాగాలన్నీ ఇదే కోవలోకి వస్తాయి. ఇలాంటి సంస్థలలో మాత్రమే కాక ఈ సంస్థల వెలుపల కూడా అనగా బస్ స్టాండులలో, రైల్వేస్టేషన్లు, విమానాశ్రయాలు, వైద్యశాలలు వంటి ప్రదేశాలన్నింటిలోనూ ర్యాగింగ్ జరపటం నేరం. 53 చట్టంలోను సెక్షను 4 ప్రకారం ర్యాగింగ్ చేయాలనే ఉద్దేశంతో కానీ లేదా ర్యాగింగ్ జరుగుతుందని తెలిసి ర్యాగింగ్ చేయటానికి సహకరించినపుడు, ర్యాగింగ్ నేరం చేయటానికి ఇతరులను రెచ్చగొట్టడం వంటి చర్యలన్నీ శిక్షించబడతాయి.

ఒక విద్యార్థిని ర్యాగింగ్ ద్వారా అవమానం చేసి అతన్ని బాధించడం జరిగితే 6 నెలల వరకు జైలు శిక్ష రూ. 1000 వరకు జరిమానా విధింపబడుతుంది. ర్యాగింగ్ నేరంలో భాగంగా నేరపూర్వక బలవంతం లేదా దాడి చేయడం వల్ల నిందితుడు బాధిత విద్యార్థిపై దాడి చేయడం జరిగితే ఏడాది వరకు జైలు శిక్ష రూ. 2000 వరకు జరిమానా విధించవచ్చు.ర్యాగింగ్ సందర్భంలో మరణించటం జరిగినా లేదా ఆ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడినా నేరస్థునికి జీవిత ఖైదు లేదా 10 సంవత్సరాల వరకు జైలుశిక్ష, రూ. 50,000 వరకు జరిమానా విధింపబడతాయి.

సెక్షన్ 4లో పేర్కొన్న ఏ తరహా జైలు శిక్షకు గురైనప్పటికీ నేరం చేసిన వ్యక్తి విద్యార్థి అయిన పక్షంలో అతన్ని కళాశాల నుండి సస్పెండ్ చేస్తారు. అదే విధంగా జైలు శిక్ష 6 మాసాలకు మించి విధింపబడితే నేరం చేసిన విద్యార్థికి మరే ఇతర విద్యాసంస్థల్లోగానీ, కళాశాలలో గానీ ప్రవేశం లభ్యం కాదు. అందుచేత ఆ విద్యార్థి భవిష్యత్ అవకాశాలను పూర్తిగా కోల్పోతాడు. ఇదేకాక ఏ విద్యార్థి అయినా తాను ర్యాగింగ్‌కు గురైనట్టు కళాశాల అధ్యక్షుడికి లేదా నిర్వాహకులకు సమాచారం అందించినప్పటికీ సంబంధిత అధ్యక్షుడు లేదా నిర్వాహకుడు విచారణ జరిపిన మీదట తనకు అందిన ఫిర్యాదు వాస్తవమేనని నిర్ధారణ చేసినపుడు నిందిత విద్యార్థులను వెంటనే కాలేజీ నుండి అవసరమైనంత కాలం సస్పెండ్ చేయవచ్చు. ఈ దిశలో అధ్యక్షుడు లేదా నిర్వాహకుని నిర్ణయానికి తిరుగులేదు. పై విధంగా సమాచారం అందుకున్న అధ్యక్షుడు లేదా నిర్వాహకుడు సరైన చర్య తీసుకోవడంలో విఫలమైనా లేదా తన బాధ్యతను నిర్లక్ష్యం చేసినా, ర్యాగింగ్ నేరస్థునికి సెక్షను 4లో ఉదహరించబడిన శిక్షలనే ఈ అధికారులకు కూడా వేయాలని సెక్షను 7 స్పష్టం చేస్తుం ది.

బాధిత విద్యార్థి, ర్యాగింగ్ పర్యవసానంగా ఆత్మహత్య చేసుకుంటే ర్యాగింగ్ చేసిన వ్యక్తులు ఈ ఆత్మహత్యను ప్రేరేపించినట్లుగా నేరం మోపబడుతుంది. 5% చట్టాలతో పాటు నేరాలకు సంబంధించిన ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇతర ప్రత్యేక చట్టాలలోని నిబంధనలు, శిక్షించదగిన నేరమయ అంశాలను ర్యాగింగ్ చట్టం క్రింద నేర అంశాలతో జోడించడం జరుగుతుంది. ఈ చటానికి అనుగుణంగా, రాష్టంలోని విద్యా సంస్థలన్నింటిలోనూ ర్యాగింగ్‌ను నిషేధిస్తూ ఉత్తర్వులు 2002 లో జారీ చేయబడ్డాయి. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ సెప్టెంబర్ 16, 2006లో అన్ని జిల్లా న్యాయ సేవాధికార సంస్థలను తమ తమ ప్రాంతాలలోని వృత్తి విద్యా కళాశాలలు, విద్యా సంస్థలు, జిల్లా కలెక్టర్ల వద్ద నుండి ర్యాగింగ్ నిరోధానికి సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం తాము తీసుకున్న చర్యలను గురించి నివేదిక సమర్పించవలసిందిగా కోరింది.

జిల్లా న్యాయ సేవాధికార సంస్థలు, తాలుకా న్యాయ సేవా కమిటీలు, తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రతి కళాశాలలోనూ ర్యాగింగ్ నిషేధ సంఘాలను ఏర్పరచి, ర్యాగింగ్ నిషేధ చట్టాన్ని పటిష్టంగా అమలు చేసేందుకు కృషి చేస్తున్నాయి. ర్యాగింగ్ మూలంగా బాధిత విద్యార్థులేకాక ఈ నేరానికి పాల్పడినవిద్యార్ధులు భవిష్యత్ అవకాశాలు ప్రమాదంలో పడతాయి. ర్యాగింగ్ అకృత్యాల నుండి విద్యార్థి లోకాన్ని కాపాడవలసిన బాధ్యత ప్రతి పౌరుడుపైనా ఉంది. ప్రతి స్కూలు, కళాశాలలో ర్యాగింగ్‌కు వ్యతిరేకంగా కమిటీని నియమించుకొని ర్యాగింగ్‌కు పాల్పడినటువంటి వారిపై కఠినమైన చర్యలు తీసుకున్నప్పుడు మాత్రమే ర్యాగింగ్ అరికట్టపడుతుంది.

మోటె చిరంజీవి
9949194327

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News