Sunday, December 22, 2024

డిఎంకె మంత్రి వ్యాఖ్యలతో సనాతన వివాదంలో “ఇండియా కూటమి”

- Advertisement -
- Advertisement -

చెన్నై : సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల దుమారానికి తాజాగా తమిళనాడు ఉన్నత విద్యాశాఖ మంత్రి కె. పొన్నుడి ఆజ్యం పోశారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో సనాతన ధర్మంపై పోరాటానికి “ఇండియా కూటమి ” ఆవిర్భవించిందని ఆయన అన్నారు. ఉదయనిధి స్టాలిన్, ఎ. రాజా తరువాత సనాతన ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడిన డీఎంకే మూడవ నేత పొన్నుడి కావడం విశేషం.

ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలను ఆప్ నేత రాఘవ్ చద్దా మంగళవారం ఖండించారు. కూటమి పార్టీలకు చెందిన చిన్ననేతలు ఇచ్చే ప్రకటనలను ఇండియా కూటమి అధికారిక నిర్ణయంగా పరిగణించరాదని పేర్కొన్నారు.“ నేను సనాతన ధర్మం నుంచేవచ్చాను. ఇలాంటి ప్రకటనలు నేను వ్యతిరేకిస్తాను. ఎవరూ ఇలాంటి ప్రకటనలు చేయకూడదు. మతం ఏదైనా సరే దానిపై వ్యాఖ్యలకు దూరంగా ఉండాలి. అన్ని మతాలను మనం గౌరవించాలి” అని రాఘవ్ చద్దా అన్నారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. సనాతన ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ల నాలుకలు ఊడలాగాలని, కళ్లు ఊడబెరకాలని కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News