Wednesday, January 22, 2025

యూకె నుంచి తిరిగొచ్చిన రాఘవ్ ఛధా

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఎంపీ రాఘవ్ ఛధా కంటి ఆపరేషన్ తర్వాత ఇంగ్లాండ్ నుంచి స్వదేశానికి తిరిగొచ్చారు. ఆయన ఢిల్లీలోని అరవింద్ కేజ్రీవాల్ అధికారిక నివాసానికి వెళ్లారు. తన ఆరోగ్యం అనుకూలిస్తే లోక్ సభ ప్రచార కార్యక్రమంలో పాల్గొంటానని ఆయన తెలిపారు.

ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ మే 2న ఓ ప్రకటనలో ‘‘యూకెలో రాఘవ్ ఛధా మేజర్ కంటి సర్జరీ చేయించుకున్నారు. ఆయన చూపును కూడా కోల్పోయే తీవ్ర స్థితిలో కంటి చికిత్స చేయించుకున్నారు. ఆయన కోలుకోగానే ఇండియాకు తిరిగొస్తారు. తర్వాత ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు’’ అని తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News