Sunday, December 22, 2024

ఆప్ ఎంపి దోషే పై సస్పెన్షన్ ఎత్తివేత

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఆప్ ఎంపి రాఘవ్ ఛద్దా సస్పెన్షన్‌ను రాజ్యసభలో ప్రవేశపెట్టిన తీర్మానం ద్వారా ఎత్తివేశారు. తరువాత ఈ రోజు నుంచి ఆరంభమైన పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు హాజరయ్యేందుకు అనుమతించారు. సభాహక్కుల కమిటీ సమావేశం అయ్యింది. ఇందులో రాఘవ్‌ను తప్పుచేసిన వాడిగానే నిర్థారించారు. ఆయన మీడియాకు తప్పుడు సమాచారం, గణాంకాలు అందించారని ఇది తమ పరిశీలనలో రుజువు అయింని తెలిపారు. ఇతరత్రా కూడా ఆర్‌ఎస్ కమిటీ ఆయన తప్పిదాలను పేర్కొంది. సోమవారం సభలో ఆయన సెస్పెన్షన్ ముగింపు తీర్మానాన్ని బిజెపి సభ్యులు జివిఎల్ నరసింహరావు ప్రతిపాదించారు.

దీనికి సభ మూజువాణితో ఆమోదం తెలిపింది. ఇప్పటికే ఆయన సస్పెన్షన్‌కు గురై ఉన్నందున దీనినే ఆయన అనుచిత వ్యవహారానికి శిక్షగా భావించి వదిలివేయాలని సభ్యులు తీర్మానంలో సూచించారు. తీర్మానానికి ముందు రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌కర్ మాట్లాడుతూ రాఘవ్ ఛద్దా రెండు అభియోగాలతో దోషి అని తేలిందని, దీనికి ముందు పూర్తి స్థాయి విశ్లేషణాత్మక పరిశీలన జరిగిందని తెలిపారు. సెలెక్ట్ కమిటీ సభ్యులుగా కొందరి పేర్లను చేర్చడానికి ముందు ఈ ఎంపి వారివారి అనుమతి తీసుకోవలేదని ఇది సభా నిబంధనల ఉల్లంఘన పరిధిలోకి వస్తుందని గమనించామని సభాధ్యక్షులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News