ఎ స్టూడియోస్ ఎల్ఎల్పీ పతాకంపై పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు నిర్మాత కోనేరు సత్యనారాయణ. నీలాద్రి ప్రొడక్షన్స్, హవీష్ ప్రొడక్షన్స్ తో కలిసి ఆయన లేటెస్ట్ ప్రాజెక్టును ప్రకటించారు. తమ సంస్థలో ఇంతకు ముందు రాక్షసుడు, ఖిలాడీ సినిమాలను తెరకెక్కించిన రమేష్‌వర్మతో మరోసారి ప్రాజెక్ట్ చేయనున్నారు కోనేరు సత్యనారాయణ. ఈ సారి బిగ్ యాక్షన్ అడ్వెంచరస్కి శ్రీకారం చుట్టనున్నారు.
ఇటీవల వరుస సక్సెస్‌ల మీదున్న రాఘవ లారెన్స్ ఈ తాజా సినిమాలో హీరోగా నటించనున్నారు. అత్యంత భారీ వ్యయంతో ప్రాజెక్టును తెరకెక్కించనున్నారు మేకర్స్. కొరియోగ్రాఫర్‌గా అత్యున్నత ప్రతిభ కనబరిచి హీరోగా మెప్పిస్తున్న రాఘవ లారెన్స్ కెరీర్లో ఇది 25వ సినిమా కావడం గమనార్హం. నవంబర్‌లో షూటింగ్‌ను ప్రారంభించి 2025 సమ్మర్లో విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
BIG ACTION ADVENTURE BEGINS!❤️🔥
The Epic Collaboration of Multi-Faceted ACTOR @offl_Lawrence & Blockbuster Director @DirRameshVarma 💥💥@AstudiosLLP, #NeeladriProductions & A #HawwishProduction next is going to be HUGE!🤩
Stay Tuned for Exciting Updates!⌛️#RaghavaLawrence25… pic.twitter.com/Kv1wYF5Dic
— Vamsi Kaka (@vamsikaka) September 14, 2024