Monday, December 23, 2024

‘’రుద్రుడు’’ ఫ్యామిలీ, మాస్, యాక్షన్ ఎంటర్ టైనర్: రాఘవ లారెన్స్

- Advertisement -
- Advertisement -

యాక్టర్ -కొరియోగ్రాఫర్-ఫిల్మ్ మేకర్ రాఘవ లారెన్స్ హీరోగా కతిరేసన్ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ ‘రుద్రుడు తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. లారెన్స్ సరసన ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటిస్తుండగా, శరత్ కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఫైవ్ స్టార్ క్రియేషన్స్ ఎల్‌ ఎల్‌ పి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, కతిరేశన్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు.

పిక్సెల్ స్టూడియోస్‌ ప్రొడ్యూసర్ ఠాగూర్ మధు ఈ సినిమాని తెలుగు రాష్ట్రాలలో విడుదల చేస్తున్నారు. ఇటివలే విడుదల చేసిన థియేట్రికల్ ట్రైలర్‌ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. రుద్రుడు ఈ నెల 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ విడుదల కానున్న నేపధ్యంలో ఈ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించారు. ఈ వేడుకలో లారెన్స్ మాస్టర్ వేదికపై డ్యాన్స్ చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ప్రీరిలీజ్ ఈవెంట్ లో రాఘవ లారెన్స్ మాట్లాడుతూ.. రుద్రుడు కథని దర్శకుడు కతిరేసన్ చాలా అద్భుతంగా చెప్పారు. అందులో మదర్ సెంటిమెంట్ నా మనసుని చాలా ఆకట్టుకుంది. నా ప్రతి సినిమాలో ఫ్యామిలీ ఎలిమెంట్స్ వుండేలా చూసుకుంటాను. అదే సమయం లో మాస్, యాక్షన్ మిస్ కాకుండా చూసుకుంటాను. రుద్రుడులో ఫ్యామిలీ , మాస్, యాక్షన్, డ్యాన్స్ అన్నీ వుంటాయి. ఏప్రిల్ 14న మీ అందరూ థియేటర్ కి వెళ్లి చూడాలి. ఇక్కడికి మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చిన అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. శివ మాస్టర్ చాలా మంచి యాక్షన్ కొరియోగ్రఫీ చేశారు. మా టెక్నికల్ టీం అందరికీ థాంక్స్.

మధు గారు నాకు లక్కీ నిర్మాత. ఆయనతో చేసిన అన్ని సినిమాలు హిట్ అయ్యాయి. మధు గారు ఈ సినిమా తీసుకోవడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. ప్రియా భవానీ శంకర్ చాలా చక్కగా చేసింది. ఒక హీరోగా నేను బావుండాలి అనే కంటే మనిషిగా నేను బావుండాలని, నా సినిమాలన్నీ విజయాలు సాధించాలని మీరు కోరుకోవడం చాలా ఆనందంగా వుంది. ‘స్క్రీన్ మీద కాదు రియల్ లైఫ్ లో హీరోగా వుండాలి’’ అని మా అమ్మ చెబుతూ వుంటుంది. నా వల్ల ఎంత సాయం చేయగలుగుతానో అంత చేస్తాను. ఈ సేవాకార్యక్రమాలు నన్ను పని మనిషిగా పెట్టుకొని దేవుడు చేయిస్తున్నాడని భావిస్తాను.

Raghava Lawrence at Rudrudu prerelease eventసేవ చేయడానికి నన్ను ఎంపిక చేసుకున్న రాఘవేంద్ర స్వామికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మూడేళ్ళ తర్వాత రుద్రుడుతో వస్తున్నాను. నాపై ఎంతో ప్రేమ చూపిస్తున్న ప్రేక్షకులు,అభిమానులకు కృతజ్ఞతలు. మీలో ఎవరికైనా చదువు, వైద్యం విషయంలో సాయం కావాలనుకుంటే లారెన్స్ చారిటుబుల్ ట్రస్ట్ కి సంప్రదించండి. మీ సేవకుడిగా నేను వున్నాను. నా దగ్గర వున్న డబ్బులన్నీ మీరు ఇచ్చినవే. మీకు సేవ చేయడానికి రెడీగా వున్నాను. మీ అందరినీ కలిసినందుకు చాలా ఆనందంగా వుంది’’ అన్నారు.

ప్రియా భవానీ శంకర్ మాట్లాడుతూ.. రుద్రుడు సినిమాలో భాగం కావడం ఆనందంగా వుంది. లారెన్స్ గారికి కృతజ్ఞతలు. రుద్రుడు ఏప్రిల్ 14న విడుదలౌతుంది. మీ అందరూ కుటుంబంతో సహా చూడాలి’’ అని కోరారు.

బివిఎస్ఎన్ ప్రసాద్ మాట్లాడుతూ.. మధు గారు లారెన్స్ మాస్టర్ కలసి చేసిన అన్ని సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. రుద్రుడు కూడా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను.ఆల్ ది బెస్ట్’’ తెలిపారు.

పుస్కూర్ రామ్ మోహన్ రావుమాట్లాడుతూ.. డ్యాన్స్ మాస్టర్ గా నటుడిగా దర్శకుడిగా,, వ్యక్తిగా లారెన్స్ ఎందరికో స్ఫూర్తి. ఆయన అన్ని రకాల జోనర్స్ సినిమాలు చేస్తున్నారు. మేము కూడా ఆయనతో ఒక సినిమా చేయాలనే ఆలోచన వుంది. రుద్రుడు పెద్ద విజయం సాధించాలి. ఈ సినిమా తర్వాత ఇంకా పెద్ద పాన్ ఇండియా సినిమాతో నెక్స్ట్ లెవల్ లో రావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.

దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ.. లారెన్స్ గ్రేట్ హ్యూమన్ బీయింగ్. స్వశక్తితో ఎదిగి.. పేరు ప్రఖ్యాతలు సంపాయించుకొని.. సమాజానికి మేలు చేయాలనుకునే అరుదైన వ్యక్తి లారెన్స్. రుద్రుడు సినిమా విషయానికి వస్తే నా మిత్రుడు మధు ఈ సినిమా తెలుగులో విడుదల చేస్తున్నారు. రుద్రుడు టీంఅందరికీ ఆల్ ది బెస్ట్’’ తెలిపారు

సోహెల్ మాట్లాడుతూ.. లారెన్స్ గారు ఎందరికో స్ఫూర్తి. ఆయన్ని చూసే డ్యాన్స్ చేయలన్న తపన పుట్టింది. ముని కాంచన ఇలా అన్నీ సినిమాలు చూస్తూ పెరిగాను. ఆత్మ విశ్వాసం వుంటే ఎదైనా సాధించవచ్చని లారెన్స్ గారు నిరూపించారు. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్తున్నాను. రుద్రుడు ఏప్రిల్ 14 న విడుదలౌతుంది. ఫుల్ మాస్ .. థియేటర్ లో రచ్చరచ్చ చెద్దాం’’ అన్నారు. ఈ వేడుకలో రుద్రుడు టీం తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News