Tuesday, January 7, 2025

‘రాఘవ రెడ్డి’ మూవీ రివ్యూ.. ఆకట్టుకున్న శివ కంఠమనేని

- Advertisement -
- Advertisement -

శివ కంఠమనేని, నందితా శ్వేత, రాశి కీలక పాత్రల్లో నటించిన సినిమా ‘రాఘవ రెడ్డి’. ఈ చిత్రంలో ప్రవీణ్, అజయ్, పోసాని కృష్ణమురళి, అన్నపూర్ణమ్మ, అజయ్ ఘోష్, బిత్తిరి సత్తి, శ్రీనివాసరెడ్డి ప్రధాన పాత్రల్లో నటించారు. శుక్రవారం థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. యాక్షన్ సన్నివేశాల్లో అద్భుతంగా నటించి శివ కంఠమనేని తెరపై వెలుగులు నింపారు.

కథ విషయానికొస్తే: లక్కీ అలియాస్ మహాలక్ష్మి (నందితా శ్వేతా) అల్లరి పిల్ల. ఆమెది పక్కా తెలంగాణ యాస. తల్లి దేవకీ (రాశి) ఆ అమ్మాయిని తీసుకుని వచ్చి విశాఖపట్నంలోని కాలేజీలో జాయిన్ చేస్తోంది. తల్లి (అన్నపూర్ణమ్మ)తో కలిసి కుమార్తెను పెంచి పెద్ద చేస్తోంది. దాంతో గారాబంతో పెరుగుతుంది. లక్కీ కాలేజీలో రాఘవ రెడ్డి (శివ కంఠమనేని) క్రిమినాలజీ ప్రొఫెసర్. ఆయన చాలా స్ట్రిక్ట్. లక్కీ అల్లరి పనులు చూసి పనిష్మెంట్ ఇస్తాడు. దీంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. అయితే, ఒక రోజు లక్కీని ఎవరో కిడ్నాప్ చేస్తారు. అప్పుడు రాఘవ రెడ్డి వద్దకు దేవకీ వస్తుంది. లక్కీని ఎవరు కిడ్నాప్ చేశారు..? క్రిటికల్ కేసులు పరిష్కరించడంలో పోలీసులకు సాయం చేసే రాఘవ రెడ్డి తన తెలివితేటలు ఉపయోగించి లక్కీని ఎలా కాపాడాడు? లక్కీ, రాఘవ రెడ్డి, దేవకీ మధ్య సంబంధం ఏమిటి? అనేదే ఈ చిత్రం.

యాక్షన్ సన్నివేశాల్లో అద్భుతంగా నటించి శివ కంఠమనేని తన పాత్రను కన్విన్స్‌గా చూపించాడు. అతనికి, రాశికి మధ్య ఉన్న భావోద్వేగ అనుబంధం సినిమాకు ప్లస్ పాయింట్లు. రాశి తన పాత్రలో తగినంతగా నటించగా, నందితా శ్వేత తన పాత్రకు సజావుగా సరిపోతుంది. అన్నపూర్ణ, రఘుబాబు, అజయ్, పోసాని కృష్ణమురళి వంటి సహాయ నటులు మెచ్చుకోదగిన నటనను ప్రదర్శించారు.

విశ్లేషణ: కమర్షియల్ కథ, కథనాలతో ప్రేక్షకుల ముందుకొచ్చిన సినిమా ‘రాఘవ రెడ్డి’. అయితే… రెగ్యులర్ యూత్ లవ్ స్టోరీని పక్కనపెట్టి డిఫరెంట్‌గా చూపించారు. తల్లీకూతుళ్లు, భార్యాభర్తల సెంటిమెంట్ ఉండేలా చూసుకున్నారు. దర్శకుడు సంజీవ్ మేగోటి రాసిన కథ, కథనాలు, సన్నివేశాలు కమర్షియల్ సినిమా ఫార్మాట్ లో తీశారు. రాఘవ రెడ్డి ఫుల్ వెయిటేజ్ ఉన్న క్యారెక్టర్. శివ కంఠమనేని ఫైట్స్ చేశారు. పవర్ ఫుల్ డైలాగ్స్ చెప్పారు. సెంటిమెంట్ సీన్స్ చేశారు. తన శక్తి మేరకు రాఘవ రెడ్డి పాత్రకు న్యాయం చేశారు. తన వరకు బాగా చేశారు. కెఎస్ శంకర్ రావ్, జి రాంబాబు యాదవ్, ఆర్ వెంకటేశ్వర్ రావు నిర్మాణ విలువలు పర్వాలేదు. సినిమా నిడివి రెండు గంటలు మాత్రమే.

లక్కీ పాత్రకు అవసరమైన యాటిట్యూడ్ నందితా శ్వేతా చూపించారు. సాంగ్స్‌లో ఎనర్జీగా స్టెప్స్ వేశారు. ఫైట్స్ సూపర్ చేశారు. డైలాగ్ డెలివరీలో ఆమె ఎక్స్‌ప్రెషన్స్ నెక్స్ట్ లెవల్ అనే చెప్పాలి. నందిత తల్లిగా రాశి ఒదిగిపోయారు. ఎమోషనల్ సన్నివేశాల్లో ఆమె నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. పోసాని, అజయ్, ప్రవీణ్, అజయ్ ఘోష్, శ్రీనివాసరెడ్డి, బిత్తిరి సత్తి తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు. పాటలు పర్వాలేదు. ఐటెం సాంగ్ చేసిన అమ్మాయి గ్లామర్ ఒలకబోసి ఆకట్టుకుంది.

రెగ్యులర్ కమర్షియల్ కథలతో కంపేర్ చేస్తే… ‘రాఘవ రెడ్డి’ కథలో కాస్త కొత్తదనం చూపించారు. వయసుకు తగ్గ పాత్రల్లో శివ కంఠమనేని, రాశి అద్భుతంగా నటించారు. వాళ్లమ్మాయిగా నందితా శ్వేతా నటించారు. సెంటిమెంట్, ఎమోషనల్ సీన్స్ బావున్నాయి.

రేటింగ్: 2.25/5

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News