Monday, December 23, 2024

జైలుకు రాఘవ

- Advertisement -
- Advertisement -

Raghava remanded in judicial custody for 14days

కుటుంబం ఆత్మహత్య కేసులో 14రోజుల రిమాండ్
మొత్తం 12కేసుల్లో నిందితుడిగా కొత్తగూడెం ఎంఎల్‌ఎ కుమారుడు
రాఘవేంద్ర నేరం అంగీకరించాడు : ఎఎస్‌పి రోహిత్ ప్రకటన

మనతెలంగాణ/కొత్తగూడెం/పాల్వంచటౌన్/ రూరల్ : రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠకు గురై ఓ కుటుంబం ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవకు 14 రోజులు రిమాండ్ విధించారు. కొత్తగూడెం మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు రాఘవను శనివారం భద్రాచలం సబ్ జైలుకు తరలించారు. రామకృష్ణ కు టుంబం ఆత్మహత్య కేసులో వనమా రాఘవ ఎ-2 నిందితుడిగా ఉన్నారు. శుక్రవారం రాఘవను అ దుపులోకి తీసుకున్న పోలీసులు.. ఈరోజు మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. ఈ ఘటనలో రాఘవతో పాటు మరో ముగ్గురిని పోలీసులు అరె స్ట్ చేశారు. దీనికి సంబంధించిన వివరాలు పాల్వం చ ఏఎస్పీ రోహిత్‌రాజు విలేఖర్ల సమావేశంలో వెల్లడించారు. ఈనెల 3 నుంచి దాదాపు ఐదు రోజులుగా పోలీసులకు దొరకకుండా తప్పించుకొని తిరుగుతున్న వనమా రాఘవను ఎట్టకేలకు శుక్రవారం రాత్రి పాల్వంచకు తరలించామన్నారు. తమ ఆత్మహత్యకు రాఘవేంద్రరావు, తన తల్లి , అక్కలు కారణమని ఆరోపిస్తూ.. సెల్ఫీ వీడియో రికార్డు చేసి, లేఖ సైతం రాసి పాత పాల్వంచకు చెందిన నాగ రామక్రిష్ణ తన భార్య శ్రీలక్ష్మీ, కుమార్తెలు సాయి సాహితీ, సాయి సాహిత్యలపై పెట్రోల్ పోసి నిప్పంటించి ఆత్మహత్యకు పాల్పడ్డారు.

నాగరామకృష్ణ, శ్రీలక్ష్మీ, సాయి సాహితి కాలిన గాయాలతో అక్కడిక్కడే మృతిచెందారు. సాయి సాహిత్య కాలిన గాయాలతో చికిత్స పొందుతూ 5వ తేదీన ఆస్పత్రిలో మృతిచెందింది. వనమా రాఘవేంద్రరావు ఆస్తి విషయంలో అన్యాయం చేస్తున్నాడని, తన భార్యను తీసుకురావాలని కోరడంతో మనస్తాపంచెంది కుటుంబ మొత్తం ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతుడి బావమరిది ఎలిమిశెట్టి జనార్దన్ ఫిర్యాదు మేరకు వనమా రాఘవ, మృతుని తల్లి, అక్కపై కేసు నమోదైంది. అప్పటి నుంచి రాఘవ పరారీలో ఉన్నాడని, అతన్ని శుక్రవారం రాత్రి దమ్మపేట మండలం మందపల్లి క్రాస్ రోడ్డు వద్ద ఎస్‌ఐ శ్రావణ్ అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. రాఘవతోపాటు ముక్తేవి గిరీష్, రాఘవేంద్రరావు డ్రైవర్ కొమ్ము మురళిని అదుపులోకి తీసుకున్నారు. ఈకేసులో పెట్రోల్ పోసి తగులబెట్టిన రామకృష్ణ ఏ 1 కాగా, ఏ2గా రాఘవేంద్రరావు, ఏ3గా మండిగ సూర్యవతి, ఏ4 కొమ్మిశెట్టిలోవ మాధవి, ఏ5 గా ముక్తేవి గిరీష్, ఏ 6గా చావా శ్రీనివాసరావు, ఏ 7గా రమాకాంత్, ఏ 8గా కొమ్ము మురళిని పేర్కొన్నారు. కాగా సూర్యవతి, మాధవి, చావా శ్రీనివాసరావు, రమకాంత్ పరారీలో ఉన్నారని ఏఎస్‌పి తెలిపారు.

గిరీష్, చావా శ్రీనివాసరావు, రమాకాంత్, కొమ్ము మురళిలపై నిందితుడు పరారు కావడానికి సహాయపడ్డందుకు సెక్షన్ 212లో కేసు నమోదు చేశామన్నారు. రాఘవేంద్రరావు మొత్తం 12కేసుల్లో నిందితునిగా ఉన్నాడని, పలు విషయాలు విచారణలో అంగీకరించాడని ఏఎస్పీ తెలిపారు. రాఘవేంద్రరావుపై 306,307,353లో కూడా కేసులున్నాయని వివరించారు. మిగతా కేసుల విచారణ కూడా కొనసాగుతోందన్నారు. ఆయా కేసుల్లో విచారణలో వెలు గు చూసిన అంశాలు కన్ఫెషన్ రిపోర్టులో వివరించామన్నారు. రాఘవేంద్రరావు అరెస్టు, కోర్టుకు తరలింపు సందర్భంగా పోలీసు ఎఎస్‌పి కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున జనం గుమిగూడారు. ఎఎస్‌పి కార్యాలయం ప్రధాన రహదారిపై ఉండటం, బస్టాండ్ ఎదురుగా ఉండటంతో పెద్ద ఎత్తున జనాలు రాఘవను చూసేందుకు ఎగబడ్డారు. ఈ సందర్భంగా రాఘవేంద్రరావును ఉరితీయాలంటే కొందరు బ స్టాండ్ ఆవరణలో పెద్దఎత్తున నినాదాలు చేశారు.

అడ్డుకున్న బిజెపి నేతలు

పాల్వంచ నుంచి కొత్తగూడెం కోర్టుకు తరలించే మార్గ మద్యంలో లక్ష్మీదేవిపల్లి బిజెపి జిల్లా అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ ఆధ్వర్యంలో రాఘ వ వెళుతున్న వాహనాలను అడ్డుకున్నారు. అక్కడ రాళ్లు విసిరేందుకు ప్రయత్నాలు జరిగాయి. రోడ్డు పై రాళ్లు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. సిపిఐ కార్యకర్తలు, మహిళాసంఘం కార్యకర్తలు ప్లకార్డులు చేతబట్టి ప్రదర్శన నిర్వహించారు. దారిపొడవునా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News